తన గెడ్డం, కెమెరా పట్టుకునే మామ సాయంతో యంగ్‌హీరో సందీప్ కిషన్ వరుస చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మినహా ఏ చిత్రం సరిగ్గా ఆడలేదు. ఈ సమయంలో ఆయనకు తమిళంలో కూడా మార్కెట్‌రావడం ఒక్కటే ఊరడింపు. ప్రసుత్తం ఆయన తమిళంలో రెండు, తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నాడు. 'నగరం' బాగున్నా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో ఆయన మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో పాటు విడుదలకు సిద్దమైన 'శమంతకమణి' చిత్రంలో నలుగురు యంగ్‌హీరోలలో ఒకడిగా నటిస్తున్నాడు.
లుక్ ఆకట్టుకుంటోంది.ఇక తాజాగా ఈ హీరో మరో సినిమా ఒప్పుకున్నాడు. 'దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రాలతో జస్ట్ ఓకే అనిపించుకున్న వంశీకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, సినిమా చూపిస్త మావా' చిత్రాలను నిర్మించిన నిర్మాత నిర్మిస్తున్నాడు. కథ, మాటలను 'నేను లోకల్'కు రైటర్‌గా పనిచేసిన ప్రసన్నకుమర్ అందించనుండటం విశేషం.
మరోవైపు ఈయన ఎంతగానో ఎదురుచూస్తున్న 'నక్షత్రం' సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. దీంతో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడు. కృష్ణ వంశీ బ్రేక్‌నిస్తాడని ఆశిస్తే ఇప్పుడు వంశీ కృష్ణ పేరుతో మరో వంశీ చేతిలో పడ్డాడు. 'నక్షత్రం' సినిమాలో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌లు కూడా నటిస్తుండటం, ఇక వంశీ మార్కు పవర్‌ఫుల్ పోలీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ కావడం, హీరోయిన్లను అందంగా, పాటలను అద్భుతంగా తీయగల కృష్ణ వంశీ కావడంతో ఆయనకు ఈ సినిమా ఆలస్యం ఇబ్బంది కలిగిస్తోంది.
అప్పుడెప్పుడో ఈ చిత్రం ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఆగిపోయిదని, కృష్ణ వంశీ ఆస్తులు అమ్ముకున్నాడని, ఇక రిలీజ్ కాదని వార్తలు వచ్చాయి. దాంతో కృష్ణ వంశీతో పాటు నిర్మాతలు కూడా ఇవి కట్టుకథలని చెప్పి రిలీజ్ డేట్ ప్రకటంచారు. ఆ డేట్ దాటిపోయి చాలా రోజులు గడించింది. మరలా ఇప్పుడు తాజాగా ఇది రిలీజ్ కాదు అని వార్తలు వస్తే మన వంశీగారికి ఒళ్లు మండిపోయ జులైలో విడుదల అంటూ ఖర్చులేని విధంగా ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. ఇది షరామమూలే అయిపోయింది..!