తాను దర్శకుడిగా మారి తీసిన ప్రతి సినిమా హిట్. అయినా కొంచెం కూడా గర్వం ఉండదు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. ఇప్పుడు జాతీయ స్థాయిలో కీర్తి గడించిన డైరెక్టర్. బాలీవుడ్ చూపంతా ఆయనమీదే. ఆయనెవరో ఇప్పుడు మీకు బాగా అర్ధమయ్యే ఉంటుంది. ఆయనెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలితో ఒక్కసారిగా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న రాజమౌళి ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. బాహుబలితో అందనంత ఎత్తుకు ఎదిగిన రాజమౌళి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలాంటి హీరోతో మొదలు పెడతాడా అని ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.
అదంతా అలా ఉంటే రాజమౌళి ఇప్పుడు తన 100 ఎకరాల పొలంలో ఫామ్ హౌస్ పనుల్లో బాగా బిజీగా వున్నాడని అంటున్నారు. అసలు బాహుబలితోనే రాజమౌళి చాలా సంపాదించేసాడని అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. బాహుబలికి వచ్చిన ప్రాఫిట్ తోనే కాస్ట్లీ ఫామ్ హౌస్ అదీ కట్టుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుండగా.... ఇప్పుడు కొత్తగా ఖరీదైన కారుని కొనుగోలు చేసాడట. తన సొంత అవసరాల కోసం, ఫ్యామిలీ కోసం రాజమౌళి బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ ను కొనుగోలు చేసాడట. దీని ధర చాలా ఎక్కువుంటుందని....అంటున్నారు. మరోపక్క రాజమౌళికి ఇప్పటికే చాలా కాస్ట్లీ కారులు ఉన్నాయట. మరి ఆ కార్ల పక్కన ఇప్పుడు బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ కారు కూడా చేరిందన్న మాట.
మరి చాలా సింపుల్ గా వుండే రాజమౌళి ఫ్యామిలీ ఇలా ఖరీదైన కారు కొని హాట్ టాపిక్ గా మారారు. అయినా బాహుబలివంటి కళా ఖండాన్ని తెరకెక్కించిన రాజమౌళి ఇలాంటి ఒక కారుకొనుక్కోవడం పెద్ద విషయమే కాదు. కాకపోతే ఇప్పుడు రాజమౌళి ఏ చిన్న పని చేసినా మీడియాతో పాటు అందరి చూపు ఆయనమీదే ఉందనడానికి ఇదో ఉదాహరణ.