టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడే తిష్ట వేసి ఇక్కడ సౌత్ ని చులకన చేసిన భామ ఇలియానాకి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా కూడా అక్కడ బిజీ కాలేకపోయింది. గత ఏడాది 'రుస్తుం' చిత్రం తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఇలియానా బాలీవుడ్ లో రెండు మూవీస్ లో నటిస్తూ బిజీ అయ్యింది. ఎంతో కాలం నుండి బాలీవుడ్ లో పాతుకుపోవడానికి ఎదురు చూస్తున్న ఇలియానా కి ఆ క్షణం ఇప్పుడు వచ్చినట్టుంది. ఇపుడు తాజాగా ఇలియానా 'బాద్‌షాహో', 'ముబారకన్'మూవీస్ లో మెరుపులు మెరిపించడానికి రెడీగా వుంది.
అనిల్‌కపూర్, అర్జున్‌కపూర్, అథియాశెట్టి, ఇలియానా వంటి భారీ తారాగణం నటిస్తున్న 'ముబారకన్' టైటిల్ సాంగ్ ప్రోమోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ ప్రోమో లో ఇలియానా తన అందాలతో ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ 'ముబారకన్' లో ఇలియానా ముందు ఎవ్వరూ కనపడటం లేదు.... అంటే ఆ రేంజ్ లో ఇలియానా అందాల ఆరబోతకు దిగిందన్నమాట. మరి అదిరిపోయే డాన్స్ తో ఆకట్టుకున్న ఇలియానా కి ఈసారి బాలీవుడ్ లో ఎదురుండదనిపిస్తుంది. ఇప్పటికే 'బాద్‌షాహో' ప్రమోషన్స్ తో బిజీగా వున్న ఇలియానా నటించిన ఈ 'ముబారకన్' కూడా రెడీ అవుతుంది.
ఇక బాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే ఇలియానా అనుకున్న మధుర క్షణాలు వచ్చేసినట్టే. ఈదెబ్బకి బాలీవుడ్ లో ఇలియానా మాత్రం సెటిలయినట్లే అని చెబుతున్నారు.