ఏ ముహూర్తాన ఎమ్మెల్యే, నటి రోజా.. నారా లోకేష్‌బాబును పప్పు, వెర్రిపప్పు అన్నదో గానీ నాటి నుంచి ఆయన ప్రవర్తిస్తున్న, మాట్లాడుతున్న, చేస్తున్న చేష్టలను చూస్తే అదే నిజమైన పేరుని అర్ధమవుతోంది. మొదట్లో పలువురు మేధావులు, విశ్లేషకులు తప్పుపట్టారు. రోజా మరీ నీచమైన పదజాలం వాడుతోందని సామాన్యులు కూడా భావించారు. కానీ తనపేరును నారా లోకేష్ సార్దకంచేసుకుంటున్నాడు. వర్ధంతికి, జయంతికి తేడా తెలవకుండా శుభాకాంక్షలు చెప్పడం, జోహార్ జోహార్ అనడం, నీటి సమస్యని పరిష్కరిస్తానని చెప్పడం పోయి నీటి సమస్యలు సృష్టిస్తానని మాట్లాడటం, ఎమ్మెల్సీగా ప్రమాణం, ప్రసంగం, మంత్రిగా ప్రమాణం ఇలా ఐటి, పంచాయితీరాజ్ శాఖామంత్రి ఘనకార్యాలు చేస్తున్నాడు.
దీంతో ఆయన్ను ఆయన మామ బాలయ్యలా మాట్లాడవద్దని, మంచి ప్రసంగాలు చేస్తున్న వాక్చాతుర్యం ఉన్న భార్య బ్రహ్మణి నుండి మాట్లాడటం నేర్చుకోమని చెప్పేంతగా సెటైర్లు వేసే దాకా పరిస్థితి వచ్చింది. ఇక ఆయన తాజాగా తనకి తన తండ్రి చూసుకుని గర్వమో..? లేక అజ్ఞానమో? అనేది తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. తిరుపతి అంతర్జాతీయ విమానశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100అడుగుల ఎత్తైన జెండాను చంద్రబాబు ఆవిష్కరించిన సందర్భంగా జాతీయ జెండాకు తన తండ్రి చంద్రబాబుతో సహా పెద్దగా పరిజ్ఞానంలేని ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా సుమారు మూడు నిమిషాల పాటు గౌరవ వందనం చేస్తున్నా, కనీసం వారిని చూసైనా బుద్ది తెచ్చుకోకుండా నిలబడి ఉండటం చూసి అందరూ నివ్వెరపోతున్నారు.
సామాన్యుల నుంచి పరిజ్ఞానం ఉన్న వారు కూడా తీవ్రంగా ఆయన్ను విమర్శిస్తున్నారు. జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు వందనం చేయడం, జాతీయ గీతం ఆలపించేటప్పుడు లేచి నిలబడి గీతానికి పాట కలపడం గానీ ఆయనకు తెలియవా? అదే టీడీపీ జెండా ఆవిష్కరణలో గతంలో ఆయన పలుసార్లు ఎన్టీఆర్ భవన్‌లో వందనం చేశాడు కదా..! మరి ఇప్పుడు ఎందుకు చేయరు?
పసిపిల్లలకి, చదువులేని వారికి కూడా తెలిసిన విషయం నారాలోకేష్‌కు తెలియదా? ఇది చిన్న తప్పుకాదు.. బూతుసినిమా ఆడుతున్న సినిమా ధియేటర్లలో షోకి ముందు ప్రేక్షకులంతా లేచి నిలబడి గౌరవం ఇవ్వాలని, లేక పోతే తీవ్రనేరంగా పరిగణిస్తామని చెప్పిన కోర్టులు ఎలా స్పందిస్తాయి? సుమోటాగా దీనిని పరిగణిస్తాయా? లేక ఎవరైనా ముందుకు వచ్చికేసు వేస్తారో చూడాల్సివుంది...!