సల్మాన్‌తో 'ఏక్‌థా టైగర్', 'భజరంగీ భాయ్ జాన్' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన కబీర్‌ఖాన్ డైరెక్షన్ లో సల్మాన్ మరోమారు ‘ట్యూబ్‌లైట్’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలైంది. 'భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్' లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత సల్మాన్ నటిస్తున్న ఈ 'ట్యూబ్ లైట్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా మరో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ‘ట్యూబ్‌లైట్’ లో అతిథి పాత్రలో నటించాడు. అయితే దేశవ్యాప్తంగా విడుదలైన 'ట్యూబ్ లైట్' కి కష్టాలు తప్పేలా లేవంటున్నారు. విడుదలకు మూడుగంటల ముందే 'ట్యూబ్ లైట్' సంబంధించిన సన్నివేశాలు ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయట.
షారూఖ్ ఇంద్రజాలికుడిగా కనిపించి పిల్లలను అలరించే కీలక సన్నివేశాలు లీక్ కావడంతో ‘ట్యూబ్‌లైట్’ నిర్మాతలు షాక్ తిన్నారు. ఈ లీకేజులతో ఒకపక్క సతమతమవుతున్న చిత్ర యూనిట్ కి ‘ట్యూబ్‌లైట్’ రివ్యూలుతో చలి జ్వరం వచ్చేసిందని అంటున్నారు. ఈ సినిమా విడుదలైన మొదటి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ ఎనలిస్టులు కూడా సినిమా పూర్తిగా డిజప్పాయింటింగ్‌గా ఉందని తేల్చేశారు. 'ట్యూబ్ లైట్' నిరాశపరిచేలా ఉందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. 'సల్మాన్ లాంటి సాలిడ్ స్టార్ పవర్, స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయని, ట్యూబ్ లైట్ బాడీ ఎంతో అందంగావున్నా ఆత్మ మిస్సయిందంటూ' సెటైర్లు వేశాడు.
బలమైన స్క్రిప్ట్ లేకపోవటం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారిందని చెబుతున్నారు. ఈ సినిమా ఆఖరికి సల్మాన్ ఖాన్ అభిమానులకు కూడా ఏమాత్రం నచ్చదనే టాక్ వినబడుతుంది. మరి 'బాహుబలి' రికార్డులను తిరగరాస్తానన్న సల్మాన్ ఈ ‘ట్యూబ్‌లైట్’ తుస్సుమని మాడిపోయి ఆయన పొగరుని అణిచేసిందనే సెటైర్స్ వేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.