Advertisementt

ఎన్టీఆర్ 'బిగ్ బాస్' ప్రోమో భామలు వీళ్లేనా..!

Sun 25th Jun 2017 01:52 PM
jr ntr,big boss,promo,madhu shalini,tejaswi madivada  ఎన్టీఆర్ 'బిగ్ బాస్' ప్రోమో భామలు వీళ్లేనా..!
Madhu Shalini and Tejaswi in Big Boss Promo ఎన్టీఆర్ 'బిగ్ బాస్' ప్రోమో భామలు వీళ్లేనా..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో బంపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోని ఇప్పుడు తెలుగులోకి దింపుతోంది స్టార్ మా ఛానల్. ఈ షో కి హోస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఈ షో  స్టార్ మా లో వచ్చే నెల నుండి ప్రసారం కానుంది. ఈ బిగ్ బాస్ షో లో ఎన్టీఆర్ హోస్ట్ అన్నప్పటి నుండి ఈ షో పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో ఇలా బుల్లితెర మీద సందడి చెయ్యడం అంటే మామూలు విషయంకాదు. ఇకపోతే ఈ షో కి సంబంధించిన షూటింగ్ అంతా ముంబైలో జరగనుందని ఎప్పుడో చెప్పుకున్నాం. 

ఇప్పటికే ప్రోమోతో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో కోసం  ఇప్పుడు షో లో పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేసే పనిలో పడిందట బిగ్ బాస్ టీమ్. అయితే బిగ్ బాస్ ప్రోమోలో ఎన్టీఆర్ తోపాటు ఇద్దరు అమ్మాయిలను చూపించారు. అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరనే దానిమీద ఇప్పుడో క్లూ దొరికిందని అంటున్నారు. బిగ్ బాస్ ప్రోమో లో ఎన్టీఆర్ పక్కన కనబడిన ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో కాదట. ఒకరు మధుషాలిని కాగా మరొకరు తేజస్విని అని అంటున్నారు.  ఈ బిగ్ బాస్ షో లో వీళ్లిద్దరు పార్టిసిపేట్ చేయబోతున్నారనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇందుకోసం ఆ ఇరువురు డేట్స్ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక మధుషాలిని, తేజస్వికి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఇస్తున్నారట.

అలాగే ఈ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఉత్సుకత చూపిస్తున్నాడట. పోసాని లాంటివాళ్ళు ఈ షోలో వుంటే కావాల్సినంత క్యూరియాసిటీ క్రియేట్ కావడం ఖాయమని భావిస్తున్నారట. మరి ఈ షో కి వస్తున్నందుకుగాను పోసానికి 2.5 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

Madhu Shalini and Tejaswi in Big Boss Promo:

Madhu Shalini and Tejaswi Madivada are the NTR Big Boss promo Girls 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ