ఎన్టీఆర్ బిగ్ బాస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని స్టార్ మా ఛానల్ వారు తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా అనుకున్నప్పటి నుండి ఈ షో పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక స్టార్ మా వాళ్ళు కూడా ఈ షో ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి టాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే బిగ్ బాస్ షోకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో లో చాలా మంది సెలెబ్రిటీస్ పార్టిసిపేట్ చేసే అవకాశం వుంది.
వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ షోకి సంబందించిన షూటింగ్ మొత్తం ముంబైలోనే జరగబోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు పార్టిసిపెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో బిజీగా వుంది. టాలీవుడ్ లోని చాలా మంది సెలబ్రిటీస్ ని ఇందులో భాగం చేసేందుకు స్టార్ మా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే టాలీవుడ్ లో టాప్ లెవల్లో దూసుకుపోతున్న సుమని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారట. బిగ్ బాస్ లో పాల్గొనేందుకు సుమకి భారీ పారితోషకాన్ని ఆఫర్ చేశారట. కానీ సుమ ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి.
ఎందుకంటే చాలా రోజులు పాటు ఈ షోకే టైం కేటాయించాల్సి రావడం, అలాగే ఈ షో కోసం హైదరాబాద్ ని వదిలి ముంబై కి వెళ్లడం వంటి విషయాలతోనే సుమ ఈ బిగ్ బాస్ షో ని రిజక్ట్ చేసిందని చెబుతున్నారు. ఇక ఈ షో కోసం ఇప్పటికే మధు షాలిని, తేజస్విని మడివాడ, పోసాని కృష్ణ మురళిని సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది.