Advertisementt

'అదిరింది' ఓకే..మరి 'వివేగమ్' సంగతేంటి..!?

Mon 26th Jun 2017 05:59 PM
vivegam,ajith,pawan kalyan,vijay,adirindi,vivegam telugu updates  'అదిరింది' ఓకే..మరి 'వివేగమ్' సంగతేంటి..!?
Ajith Vivegam to be remade in Telugu? 'అదిరింది' ఓకే..మరి 'వివేగమ్' సంగతేంటి..!?
Advertisement
Ads by CJ

ఇటీవల వరుస విజయాలతో అజిత్‌ అదరగొడుతున్నాడు. మరీ ముఖ్యంగా దర్శకుడు శివ దర్శకత్వంలో ఆయన నటించిన 'వీరం, వేదాళం' టాక్‌తో సంబంధం లేకుండా దాదాపు 100కోట్లు రాబట్టాయి. దీంతో వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా 'వివేగం' వస్తుండంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రం బడ్జెట్‌ 'బాహుబలి 1' కి ధీటుగా 120పైగా కోట్లను పెడుతున్నారు. ఇందులో అజిత్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించాల్సి రావడంతో మొత్తంగా దాదాపు యూరోప్‌లోని 12 దేశాలలో షూటింగ్‌ జరిపారు. మంచు, వాన, అద్భుతమైన విజువల్స్‌, అజిత్‌ నటన, ఆయన పవర్‌ఫుల్‌గా కనిపించనుండటంతో ఈ చిత్రానికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇక ఎప్పుడు చొక్కా వదలని అజిత్‌ కూడా ఈ సినిమా కోసం కండలు పెంచి, సిక్స్‌ప్యాక్‌తో అదరగొడుతున్నాడు, మంచు కొండల్లో దుంగ పట్టుకుని కనిపించే పోస్టర్‌ చాలాకాలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో కాజల్‌తో పాటు కీలకపాత్రలో అక్షరహాసన్‌ నటించనుంది. మరోవైపు దీనిలో అజిత్‌కి ధీటైన పాత్రలో వివేక్‌ ఒబెరాయ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  కానీ అది పాజిటివ్‌ క్యారెక్టరా? లేక నెగటివ్‌ పాత్రా అనేది చెప్పడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. సినిమా చూస్తేనే థ్రిల్‌ అని విజువల్‌ వండర్‌గా హాలీవుడ్‌ స్థాయిలో సినిమా ఉంటుందని మాత్రం తేల్చేశాడు. ఈ చిత్రం కోసం అనేక దేశాలు తిరగడం ఇదే మొదటి సారి అన్నాడు. 

ఇక విజయ్‌, అజిత్‌లు ఇప్పటివరకు ఒకటి అరా చిత్రాలను మాత్రమే ఈ మధ్యకాలంలో డబ్‌ చేశారు. అయినా పెద్దగా ఆడలేదు. కానీ విజయ్‌ మాత్రం తన దండయాత్ర ఆపకుండా 'అదిరింది'తో వస్తున్నాడు. మరి అజిత్‌ కేవలం తమిళ్‌కే పరిమితమై, హిట్టు అయితే పవన్‌కి రీమేక్‌ రైట్స్‌ ఇస్తాడా? లేక వివేక్‌ ఒబెరాయ్, కాజల్‌, అక్షరహాసన్‌ వంటి వారు ఉండటంతో తానే తెలుగుతో పాటు హిందీలోకి డబ్‌ చేస్తాడా? అనేది ఆసక్తికరం. ఈ చిత్రం ఆగష్టు11న విడుదలకానుంది. 

Ajith Vivegam to be remade in Telugu?:

Director Siva is collaborating with Ajith for the third time in a row for Vivegam after Veeram and Vedalam.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ