'బాహుబలి'.. ఏ ప్రాంతీయ చిత్రం సాధించని విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు 'డిజె' చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లు సాధిస్తోంది. దాంతో బాలీవుడ్ ట్రేడ్ నిపుణుడు, ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'బాహుబలి'తో పాటు ఇప్పుడు 'డిజె' కూడా కలెక్షన్లలో అదరగొడుతోంది. తెలుగు మార్కెట్ అమెరికాలో సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికైనా బాలీవుడ్ తమ మొద్దు నిద్రను వీడాలి. వారిని చూసైనా మనం మంచి చిత్రాలు తీసి వారితో పోటీపడాలి అంటూ ట్వీట్‌చేశాడు.
అంతేకాదు.. సల్మాన్‌ఖాన్ మూవీ 'ట్యూబ్‌లైట్' కంటే దువ్వాడ జగన్నాథం 'డిజె' ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిందంటూ కలెక్షన్ల లెక్కలను చూపించాడు. దీంతో ఇతనేమి పుసుక్కున ఇంత మాట అనేశాడు అని బాలీవుడ్ వారు 'దంగల్'ని చూపించి, ఎప్పుడు ఎవ్వరూ అన్ని బ్లాక్‌బస్టర్సే తీయరు. కాస్త ఒడిదుడుకులు సహజం. కాబట్టి ఒకటి రెండు చిత్రాలకే మన సినిమాలను, మన స్టాండర్డ్స్‌ను తప్పుపడితే ఎలా అని తరుణ్ ఆదర్శ్ వ్యాఖ్యలకు బాలీవుడ్ లోని కొందరు మండిపడుతున్నారట. ఇక 'ట్యూబ్‌లైట్'తో పాటు 'డిజె' కూడా నెగటివ్ టాక్ వచ్చినా సల్మాన్ కంటే బన్నీ ఎక్కువ కలెక్ట్ చేస్తుండటం మాత్రం పచ్చినిజం, నిజం చెప్పినందుకు ఇప్పుడు అందరూ తరుణ్‌ని తిట్టిపోస్తున్నారు.