Advertisementt

ఎంత ఎదిగిపోయావయ్యా.. ఓ లిటిల్‌ పవర్‌స్టార్‌!

Tue 27th Jun 2017 04:03 PM
pawan kalyan,renu desai,pawan son akira nandan,marathi film,akira nandan  ఎంత ఎదిగిపోయావయ్యా.. ఓ లిటిల్‌ పవర్‌స్టార్‌!
Pawan Kalyan Son Akira Nandan ఎంత ఎదిగిపోయావయ్యా.. ఓ లిటిల్‌ పవర్‌స్టార్‌!
Advertisement
Ads by CJ

పవన్‌ కళ్యాణ్‌ రేణుదేశాయ్‌ దంపతులకు అకీరా నందన్‌ ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల మరాఠిలో రేణూదేశాయ్‌ చిత్రంలో ఇతను బాలనటునిగా అలరించాడు. మరాఠిలో వచ్చిన ఈ సినిమాను రేణు తెలుగులోకి కూడా అనువాదం చేసి రిలీజ్‌ చేస్తానని మాట ఇచ్చింది. కానీ సినిమా థియేటర్లలో కాకుండా ఏకంగా ఈటీవీ చానెల్‌లో ప్రసారమైంది. అందులో బుల్లి అకీరా కనిపించాడు. పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఆ కుర్రాడు ఎలా ఉంటాడా? అని అందరూ ఆ రోజు టీవీలో సినిమా చూశారు. 

ఆ సినిమాలో బుడ్డోడిగా ఉన్న అకీరానందన్‌ తాజాగా ఆమె తల్లి చెల్లితో కలిసి తీయించుకున్న ఫొటో వైరల్‌ అవుతోంది. అమ్మకన్నా హైట్‌గా, మంచి పర్సనాలీటీతో అతను కనిపిస్తుండటం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఇంతలోనే ఎంతగా ఎదిగాడు? అనిపిస్తోంది. ఇక ఈ ఫొటో చూసిన వారందరూ అచ్చు పవన్‌ కళ్యాణ్‌ లాగా ఉన్నాడని, లిటిల్‌ పవర్‌స్టార్‌ అని పిలుస్తున్నారు. కాగా ఇతననని మెగా ఇమేజ్‌కి దూరంగా మొదట మరాఠి చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేయాలని రేణూదేశాయ్‌ భావిస్తున్నట్లు ఆ రోజుల్లో ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ నటునిగా రాటుదేలిన తర్వాత మాత్రమే తెలుగులో పరిచయం చేయాలనే ఆలోచనలో రేణూదేశాయ్‌ ఉన్నట్లు సమాచారం. 

Pawan Kalyan Son Akira Nandan:

Pawan Kalyan and Renu Desai is the son of Akira Nandan is know every one. Recently, he was appearing as a child character in Renu Desai in Marathi film he is doing excellent acting.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ