Advertisementt

ప్రేక్షకులు మంచోళ్ళంటూ క్రిటిక్స్ పై పంచ్!

Tue 27th Jun 2017 07:49 PM
allu arjun,dj duvvada jagannadham,dj duvvada jagannadham thank you meet,audience,critics  ప్రేక్షకులు మంచోళ్ళంటూ క్రిటిక్స్ పై పంచ్!
Allu Arjun speech at DJ Thank You Meet ప్రేక్షకులు మంచోళ్ళంటూ క్రిటిక్స్ పై పంచ్!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ సినిమాలకు ఈ మధ్యన నెగెటివ్ ప్రచారం జరిగినా కూడా అవి హిట్టై కూర్చుంటున్నాయి. వెబ్ మీడియా, ప్రింట్ మీడియాలో నెగెటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపే స్థాయిలో వచ్చిపడుతున్నాయి. మొన్నటికి మొన్న 'సరైనోడు' చిత్రంలోనూ ఇదే జరిగింది. సినిమా విడుదల కాగానే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు క్రిటిక్స్ కూడా సరైనోడికి సరైన రేటింగ్స్ ఇవ్వలేదు. అయినా 'సరైనోడు' సినిమా అల్లు అర్జున్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్టై కూర్చుంది. ఇక ఇప్పుడు కూడా 'డీజే దువ్వాడ జగన్నాథం' చిత్రంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యిందంటున్నారు. 

'డీజే' చిత్రం విడుదల కాగానే ఫస్ట్ షో నుండే సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చేసింది. అలాగే క్రిటిక్స్ కి కూడా సినిమా అస్సలు నచ్చలేదేమో అతి తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. ఇక 'డీజే' ప్లాప్ అయ్యిందనే వార్త మాత్రం బాగానే స్ప్రెడ్ అయ్యింది. కానీ 'డీజే' కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం సినిమా హిట్ అయ్యేలాగే కనబడుతుంది. ఇదే విషయాన్నీ 'డీజే' టీమ్ థాంక్స్ మీట్ పెట్టి మరీ చెప్పింది. ఈ మీట్ లో  తన సినిమా నెగెటివ్ మీద స్పందించిన అల్లు అర్జున్ ఆ రివ్యూస్ ని తానూ అస్సలు పట్టించుకోనని చెప్పాడు. అలాగే ప్రేక్షకులు మంచోళ్ళు కాబట్టి నా సినిమా ఆదరించారు. అందుకు వారికి ఎప్పటికి రుణపడి ఉంటానన్నాడు. 

అలాగే నెగెటివ్ రివ్యూస్ వచ్చిన విషయం నాకు తెలుసు.... కానీ నా పాజిటివ్ యాటిట్యూడ్ తో నెగెటివ్ రివ్యూస్ ను క్రాస్ చేస్తాను అంటూ స్పీచ్ ఇచ్చాడు. మరి ప్రేక్షకుల ప్రేమ ఉన్నంతవరకు అల్లు అర్జున్ ఇలానే దూసుకుపోతాడన్నమాట.

Allu Arjun speech at DJ Thank You Meet:

Allu Arjun praises Audience at DJ Duvvada Jagannadham Thank You Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ