Advertisementt

పైరసీ రాయుళ్లు ఒణుకు పుట్టిస్తున్నారు..!

Thu 29th Jun 2017 01:57 PM
producer dil raju,director harish shankar,dj movie,jr ntr,kalyan ram,jai lava kusa,piracy cds  పైరసీ రాయుళ్లు ఒణుకు పుట్టిస్తున్నారు..!
Dil Raju and Harish Complains Of Cyber Crime Against Piracy Of 'DJ' పైరసీ రాయుళ్లు ఒణుకు పుట్టిస్తున్నారు..!
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా సోషలో మీడియాలో సినిమాల లీకులు మాత్రం బాగా తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో గాని ఆయా సినిమాల నిర్మాతలకు మాత్రం తల  బొప్పికడుతుంది. అయితే ఈ పైరసీ భూతం ఎప్పటి నుండోవున్నదే కానీ సినిమా విడుదలయిన వెంటనే పైరసీ చేస్తున్నారంటే అనుకోవచ్చుగాని... అసలు సినిమా టీజర్ ని కూడా లీక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటే ఏం అనుకోవాలి. 

ఇప్పుడు తాజాగా గత శుక్రవారం విడుదలైన 'డిజె' సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కురిపిస్తుంది అంటున్నారు. అసలే టాక్ బాగోక దర్శకనిర్మాతలు బాధపడుతుంటే ఇప్పుడు 'డిజె దువ్వాడ జగన్నాథం' చిత్రం పూర్తి కాపీ ని సోషల్ మీడియాలో పెట్టేశారు. అసలు సినిమా ఆలా విడుదలైందో లేదో ఇలా సోషల్ మీడియాలో కొన్ని సీన్స్ ని లీక్ చేశారు పైరసీగాళ్ళు.  ఇక రెండో రోజుకే సినిమా మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ అవడమూ జనాలు షేర్ కొట్టడము జరిగిపోయాయి. ఈ దెబ్బకి నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ సైబర్ క్రైం పోలీస్ లను ఆశ్రయించారు. డిజె పైరసీ ఎక్కడ కనబడినా వారిని వదిలిపెట్టమని చెబుతూనే పోలీస్ స్టేషన్స్ వెంట తిరుగుతున్నారు.

ఇక ఇప్పుడు మరో విచిత్రం ఏమిటంటే సినిమా షూటింగ్ లో ఉండగానే టీజర్ కోసం కట్ చేసిన రష్ ని కూడా పైరసీగాళ్ళు సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ ప్రోగ్రెస్ లో వుంది. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని జులై మొదటి వారంలో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ని కట్ చేసింది. అయితే ఆ సీన్స్ ని ఇంకా ఫైనల్ చెయ్యలేదు. కేవలం రష్ మాత్రమే నట. ఇక ఆ రష్ ని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా సృష్టించారు. విషయం తెలుసుకున్న 'జై లవ కుశ'  నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైం పోలిసుల దగ్గరకు వెళ్లగా వారు వెంటనే రంగంలోకి దిగి ఆ నేరగాణ్ణి అరెస్ట్ చేశారట. 

మరి చిత్ర యూనిట్ ఎంతగా శ్రద్ద తీసుకుంటున్నప్పటికీ ఇలా లీకేజులు మాత్రం అందరికి చికాకు తెప్పిస్తుంది. అసలు సినిమా లొకేషన్స్ లోకి ఏ ఎలక్ట్రిక్ వస్తువులను  అనుమతించరు. ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకుని షూటింగ్ జరుపుతున్నప్పటికీ షూటింగ్ స్పాట్లోని పిక్స్, సీన్స్ ఎలా లీక్ అవుతున్నాయో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. మరి ఇలా రెండుమూడు రోజుల తేడాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని రెండు బడా సినిమాల లీకులు ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. ఇలాంటి లీకులు మున్ముందు ఇంకెన్ని చూడబోతున్నామో అని అందరూ కంగారు పడుతున్నారు.  

Dil Raju and Harish Complains Of Cyber Crime Against Piracy Of 'DJ' :

DJ Duvvada Jagannatham is a stylish star movie produced by Dil Raju in director by Harish Shankar's Telugu movie. The film will release the collections at the box office and release the film to victory. Dilraju is Duvvada Jagannatham Movie piracy complained to cyber police.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ