పాపం దర్శకుడు బాబికి ఏమీ కలసిరావడం లేదు. పవన్‌తో 'సర్దార్‌గబ్బర్‌సింగ్'కి పేరైతే పడింది కానీ ఆ చిత్రం ఆయనే తీశాడో లేదో ఆయనకే తెలీదు.హడావుడిగా రిలీజ్ డేట్ ఇచ్చి, విదేశాలలో మూడు రోజుల్లో రెండు పాటలు చేశారు. ఆపాటల్లో పవన్ స్టెప్పులే కాదు.. పాటకి పెదాలు కూడా కదపడం మర్చిపోయాడు. క్వాలిటీ కంటే రిలీజ్ డేట్‌తో హడావుడి మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న 'జై లవ కుశ' పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అంటున్నారు.
ఇంకా షూటింగ్ సగం ఉండగానే దసరారేసు అని చెప్పి, బాలయ్య, మహేష్‌ల కంటే ముందే రావాలని జూనియర్ ఫిక్సయ్యాడు. నందమూరి హీరోలు ఒక్క మాట చెబితే వందసార్లు చెప్పినట్లే.. మడమతిప్పేది లేదు. మాట తప్పేది లేదంటారు. అసలు తాను తీయాల్సిన సినిమాను ఎన్టీఆర్ చేస్తూ, అందరిలా కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి మేకప్‌మేన్‌లను రప్పించి ఏకంగా మూడు పాత్రలు చేస్తున్నాడు. విలన్ గెటప్‌కు మేకప్‌కే రోజుకు ఐదారు గంటలు పడుతోందని టాక్.
బాలయ్య, మహేష్‌ల కంటే ఓ వారం ముందుగా వచ్చేసి క్యాష్ చేసుకుందామని ఫిక్స్ అయి సెప్టెంబర్ 21కే రావాలని ఒకటే హడావుడి చేస్తున్నాడట జూనియర్. దీంతో ఈసారి కూడా అదే టెన్షన్‌లో క్వాలిటీ కంటే సినిమా ముందుగా రిలీజ్ చేయడమే ముఖ్యం అనుకుని, ఇక హీరో ఎన్టీఆర్,అన్న నిర్మాత కళ్యాణ్‌రామ్‌లు ఫిక్సయిన తర్వాత ఇక బాబి చేతుల్లో కూడా ఏమీలేదని, పరిస్థితి చేయిదాటుతోందని పిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీన్ని తెలిసిన వారంతా అయ్యో బాబీ అనే వారే గానీ ఓదార్చేవారే లేరు.ఎక్కడికి పోయినా తన టాలెంట్‌ను, తన మాటను పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. పెద్దహీరోల చిత్రాలలో అవకాశాలొచ్చిన ఆనందం ఎంతో సేపు నిలవడం లేదంటున్నారు.