Advertisementt

స్టార్స్‌ వల్లే స్టార్‌ మా ఛానల్ కు కష్టాలు!

Sat 01st Jul 2017 12:05 AM
star maa tv,it sector,employess,chiranjeevi,jr ntr,big boss  స్టార్స్‌ వల్లే స్టార్‌ మా ఛానల్ కు కష్టాలు!
Maa TV fires 80 employees because of Jr.NTR and Chiru? స్టార్స్‌ వల్లే స్టార్‌ మా ఛానల్ కు కష్టాలు!
Advertisement
Ads by CJ

మాటీవీలో నాగార్జున హోస్ట్‌గా చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' వరకు కాస్త టీఆర్పీలు తగ్గుతూ వచ్చినా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఎన్నోఅంచనాలు, ఆలోచనలతో తీసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా వచ్చిన తర్వాత టీఆర్పీలు దారుణంగా పడిపోవడంతో స్టార్‌ మాలో టెన్షన్‌ మొదలైంది. కాగా ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. పలు సంస్థలు ఉద్యోగుల్లో కోతలను విధిస్తున్నాయి. ఐటి తర్వాత ఉద్యోగులకు కోతపడుతున్న రెండో రంగం ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగమేనని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. 

సీనియర్‌ మోస్ట్‌ల జీత భత్యాలు భారీగా, భారంగా పరిణమిస్తున్నా కూడా చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి టీఆర్పీలు తేవడంలో సీనియర్‌ మోస్ట్‌లు విఫలమయ్యారని భావిస్తున్న స్టార్‌మా యాజమాన్యం తమ సంస్థలోని 80 నుంచి 100మంది ఉద్యోగుల వరకు స్వస్తిపలకాలని నిర్ణయించిందని సమాచారం. అందుకుగాను తీసివేసే ఉద్యోగులకు సంబంధించి వేరే ఉద్యోగాలు చూసుకోమని సంస్థ నిర్వాకులు ఆ ఉద్యోగులకు ముందుగానే చెప్పేశారట. 

ఈ ఆర్థిక భారం ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేయనున్న 'బిగ్‌బాస్‌'కి ముందే తగ్గించుకుంటే కొంతలో కొంతమేలని పాత సీనియర్‌ మోస్ట్‌ల బదులుగా యువతరానికి తక్కువ జీతంలో ఉద్యోగాలు ఇచ్చి వారిలోని క్రియేటివిటీనీ ఉపయోగించుకోవాలని యాజమాన్యం భావిస్తుండటంతో కనీసం 90మందైనా సంస్థ నుంచి బయటకు రావడం గ్యారంటీ అంటున్నారు. 

Maa TV fires 80 employees because of Jr.NTR and Chiru?:

Looks like Entertainment Channels are started giving layoffs to employees after IT Sector. Recently, MAA TV, which was turned as Star Maa after Star group acquired it. Sources informed that they have sacked 80 of its senior-most employees. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ