ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమా బిజీగా వున్నాడు. ఒకపక్క సినిమాలతో బిజీగా వున్న ఎన్టీఆర్ మరోపక్క బుల్లితెర మీద బిగ్ బాస్ అనే రియాలిటీ షో తో బిజీ అయ్యాడు. ఎన్టీఆర్ తాజాగా బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా చేస్తున్న 'జై లవ కుశ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మూడు పాత్రలతో విభిన్నంగా కనిపించనున్నాడు. పక్కా మాస్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ 'జై లవ కుశ' ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం కంప్లీట్ కాగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు.
త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి ముందుగా పవన్ చిత్రాన్ని ఫినిష్ చెయ్యాల్సిన పని వుంది. ప్రస్తుతం పవన్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమా కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ సినిమాకి షిఫ్ట్ అవుతాడన్నమాట. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ కి మధ్యన కథా చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇదివరకే ఓ సారి చర్చలు జరిపినా.. కూడా ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉంది కాబట్టి మరోసారి ఎన్టీఆర్ ని కలిసి కథని వినిపించాడట త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ చెప్పిన కథ విన్న ఎన్టీఆర్ దాన్ని ఫైనల్ చేశాడని....అంటున్నారు.
కథా చర్చలు పూర్తవడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టడానికి సిద్ధం అయ్యారని అంటున్నారు. అయితే త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చెయ్యబోయే చిత్రం పూర్తి ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే నవంబర్ లో సెట్స్ మీదకెళ్లే సూచనలు ఉన్నాయంటున్నారు.