Advertisementt

పూరి దగ్గర ఛార్మి చేస్తుంది ఇదేనంట..!

Mon 03rd Jul 2017 05:43 PM
charmi,paisa vasool,balayya,balakrishna,puri jagannadh,charmi kaur,puri direction department  పూరి దగ్గర ఛార్మి చేస్తుంది ఇదేనంట..!
Charmi Reacts on Rs 4 Crores Remuneration పూరి దగ్గర ఛార్మి చేస్తుంది ఇదేనంట..!
Advertisement
Ads by CJ

హీరోయిన్ ఛార్మికి టాలీవుడ్ లో ప్రస్తుతానికి ఆఫర్స్ అంటూ ఏం లేవు. ఆమెకున్న క్రేజ్ పూర్తిగా పోయినట్లే అంటున్నారు. అందుకే కనీసం ఐటెం సాంగ్ చేసే అవకాశం కూడా ఇవ్వడంలేదని అంటున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న వ్యామోహంతో ఛార్మి డైరెక్టర్ పూరి చెంతకు చేరి ఆయనగారి వ్యాపార లావాదేవీలను చూసుకుంటుంది. పూరి కనెక్ట్స్ పేరుతొ పూరి నిర్వహిస్తున్న వ్యాపారలావాదేవీలను ఛార్మి అన్ని తానై చూసుకుంటుంది.

అందులో భాగంగానే పూరి డైరెక్ట్ చేసే సినిమాలకు సంబందించిన అన్ని పనులు అంటే... ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాగా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పుడు బాలకృష్ణ - పూరి కాంబోలో వచ్చే 'పైసా వసూల్' చిత్రానికి కూడా ఛార్మి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంది. అందుకు గాను ఛార్మి నాలుగు కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. 

అయితే ఈ ప్రచారానికి స్పందించిన ఛార్మి మీడియాలో నేను నాలుగు కోట్లు  తీసుకుంటున్నానని వస్తున్న వార్తల్లో నిజంలేదని... నేను పూరి డైరెక్షన్ డిపార్మెంట్ లో నెలవారీ జీతానికి జాబ్ చేస్తున్నట్లు చెబుతుంది. అయితే ఛార్మి చెబుతున్నట్లు ఛార్మికి నెలకు మూడు నుండి నాలుగు లక్షల జీతం పూరి డిపార్ట్మెంట్ నుండి ఇస్తుండొచ్చనే ప్రచారం మొదలైంది. ఇక పూరి సినిమాకి సంబందించిన విషయాలతో పాటు పూరి చేసే కొన్ని వ్యాపారాలను, స్క్రిప్ట్ వర్క్ ని, డైరెక్షన్ టీమ్ ని మాత్రం తాను లీడ్ చేస్తానని కూడా చెబుతుంది ఛార్మి.

Charmi Reacts on Rs 4 Crores Remuneration:

The Punjabi beauty Charmi Kaur has been busy handling the production duties of the flick Paisa Vasool. This Balayya starrer fetched her whopping sum as her salary.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ