ఇరవై ఏళ్ళు కామెడీ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన బ్రహ్మానందంకు అకస్మాత్తుగా సినిమాలు తగ్గిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల పక్కన అవకాశాలు తగ్గాయి. కొత్త కమేడియన్స్ పుట్టుకువచ్చారు. మరోవైపు ఆరు పదుల వయస్సు దాటిన బ్రహ్మీలో ఇది వరకటి హుషారు తగ్గిందని అంటున్నారు. పైగా రోజు వారి కాల్షీట్ లో ఎక్కువ గంటలు పనిచేయలేకపోతున్నారు. ఈ కారణాల వల్ల చిన్న సినిమాలకే పరిమితమైన బ్రహ్మీకి కల్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్ర దక్కింది.
ఎమ్మెల్యే పేరుతో నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో పూర్తిస్థాయిలో నవ్వించే పాత్రని చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాతో మళ్లీ పుంజుకునే అవకాశాలు తక్కువే అయినప్పటికీ, బ్రహ్మీలో ఇది వరకు కనిపించే చలాకితనం లేదనే మాట వినిపిస్తోంది. సినిమా రంగంలో ఆర్టిస్టులకు ఎత్తుపల్లాలు సహజమే.