అఖిల్ ని రీ లాంచ్ అంటూ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తానే నిర్మాతగా నాగార్జున ఒక మూవీ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లోనే ఈ మూవీ సెట్స్ మీదకెళ్లింది. షూటింగ్ మొదలు పెట్టుకుని ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ అఖిల్ పక్కన నటించే హీరోయిన్ పేరు బయటికి రాలేదు. అయితే ఇప్పుడు అఖిల్ మూవీ పై ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అఖిల్ చేసే సినిమా స్టోరీ లీకయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ లీకైన స్టోరీ మరో మూవీ స్టోరీ ఒకేలా వున్నాయంటూ కూడా ప్రచారం మొదలైంది.
అఖిల్ మూవీకి సంబంధించి లీకైన స్టోరీ ప్రకారం... హీరో, హీరోయిన్ ఇద్దరూ చిన్నపుడే హీరో ఇంటికి హీరోయిన్, హీరోయిన్ ఇంటికి హీరో తెలియకుండా మారిపోతారట. అయితే ఈ విషయం తెలియని హీరో హీరోయిన్ ఇద్దరూ పెరిగి పెద్దయ్యాక ప్రేమలో పడి సొంత ఇళ్లకే అల్లుడు.. కోడలుగా వెళతారట. అయితే ఇద్దరికీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో విషయం బయటపడుతుందని అంటున్నారు. ఇక అక్కడి నుండి ఇద్దరు ఫ్యామీలీల మధ్య ఎమోషనల్ గా కథ సాగుతుందని అంటున్నారు. మరి స్టోరీ చూస్తే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ లా అనిపిస్తుంది.
అయితే ఇదే కథతో ఇప్పుడు మరో మూవీ తెరకెక్కిందని అంటున్నారు. సాయి కొర్రపాటి నిర్మాతగా తెరకెక్కిన 'రెండు రెళ్ళు ఆరు' చిత్ర స్టోరీ కూడా పైన చెప్పిన స్టోరీ కి దగ్గరగా ఉంటుందంటున్నారు. మరి ఈ చిత్రం ఈ నెల 7 నే విడుదల కాబోతుంది. అయితే అఖిల్ రెండో సినిమా స్టోరీ, 'రెండు రెళ్ళు ఆరు' సినిమా స్టోరీ దగ్గరగా వున్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.... అఖిల్ మూవీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోందనీ అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు.