ఈమద్య వరుస హిట్స్ నేపధ్యంలో అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నారు. మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకున్న 'రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి' మరీ ముఖ్యంగా 'సరైనోడు, డిజె'లు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్లు బాగా వసూలు చేస్తున్నాయి. దీంతో మనోడి కాన్ఫిడెన్స్ కాస్తా ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్‌గా మారిదంటున్నారు. నిజంగానే బన్నీ గర్వించాల్సిన విషయం ఇది. ఎన్నో నెగటివ్ టాక్‌లు, పరమ రొటీన్ అనే పేరు వచ్చిన చిత్రాలు కూడా యాంటీ ఫ్యాన్స్, క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ కావడమంటే మామూలు మాటకాదు.
పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాలే కాస్త నెగటివ్ టాక్ వస్తే వీకెండ్ తర్వాత థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బన్నీని కేవలం మెగాహీరోగా చూడకుండా ఆయనకంటూ సొంత అభిమానులు కూడా ఏర్పడ్డారు. రామ్ చరణ్‌కే సాధ్యం కాని పనిని బన్నీ చేసి చూపించాడు. కానీ బన్నీ ఈమధ్య తన మాటలతో పాటు ఇతరుల మాటలతో కూడా వివాదంలో చిక్కుకుంటున్నాడు. కాబోయే మెగాస్టార్ బన్నీనే అని ప్రచారం మొదలైంది.
ఇక గతంలోనే 'చెప్పను బ్రదర్' సంగతి తెలిసిందే. దీంతో మెగాభిమానులు మండిపడుతున్నారు. కనీసం అలా చేసే వారినైనా బన్నీ ఎందుకు వారించడం లేదు? పవన్ ఇతరుల వేడుకల్లో తన అభిమానులు గొడవ చేయడాన్ని, తన ఫ్యాన్స్‌కి ఎందుకు చెప్పడం లేదు అన్న తరహాలోనే బన్నీ.. ఈ మెగాస్టార్ వంటి వాటికి ఎందుకు ఖండించడం లేదని చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఇక ఈ మధ్య మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీలోని యువస్టార్స్‌లో తానే నెంబర్ వన్ అంటే దానిలో తప్పేంలేదని, దానిని తాను ఓ కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని చెప్పాడు.
ఇక తాజాగా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్ బుక్‌మై షో తన ఫేస్‌బుక్‌లో మెగాస్టార్ అల్లు అర్జున్ ఈజ్ బ్యాక్ అని పోస్ట్ చేసింది. దీంతో కొందరు అబ్బా.. ఇంకా మెగాస్టార్ అంటే చిరంజీవి అనుకున్నామే అని సెటైర్లు వేస్తున్నారు. కానీ వాటిని ఖండించే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు ఈ అల్లువారి అబ్బాయ్.. చూద్దాం... భవిష్యత్తు ఎలా ఉంటుందో....!