Advertisementt

యంగ్‌టైగర్‌ ఫ్యాన్స్‌కి ట్రిపుల్‌ బొనాంజా..!

Thu 06th Jul 2017 02:12 PM
jr ntr,jai lava kusa movie,kalyan ram,bobby,jai lava kusa teaser,release 6th july  యంగ్‌టైగర్‌ ఫ్యాన్స్‌కి ట్రిపుల్‌ బొనాంజా..!
Jr NTR Jai Lava Kusa Movie Teaser Release on 6th July యంగ్‌టైగర్‌ ఫ్యాన్స్‌కి ట్రిపుల్‌ బొనాంజా..!
Advertisement
Ads by CJ

బాబి దర్శకత్వంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయాన్ని తొలిసారిగా చేస్తున్న చిత్రం 'జై లవ కుశ'. ఎన్టీఆర్‌ అన్నయ్య నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనుండగా, ఎన్టీఆర్‌ సరసన నివేధా ధామస్‌, రాఖి ఖన్నాలు హీరోయిన్లుగా తొలిసారి నటిస్తున్నారు. 

ఈ చిత్రం టీజర్ రేపు సాయంత్రం 5.22 నిమిషాలకు విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కేవలం 'జై' పాత్రను పరిచయం చేసే ఒకే టీజర్‌ వస్తుందని అందరూ భావించారు. కానీ యూనిట్‌ మాత్రం ఒకేసారి ఇందులోని మూడు పాత్రలైన 'జై', 'లవకుమార్‌', 'కుశకుమార్‌'లను పరిచయం చేస్తూ మూడు టీజర్లను ఒకేసారి విడుదల చేయనున్నారు. 

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ జై పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రపై భారీ అంచనాలున్నాయి. ఈ పాత్ర మేకప్‌ కోసం ఏకంగా హాలీవుడ్‌ నుంచి మేకప్‌ టెక్నీషియన్స్‌ని తీసుకొచ్చి, ప్రొస్తటిక్‌ మేకప్‌ చేయించారు. ఇక సినిమాలో ఒకే హీరో మూడు పాత్రలను చేయనుండటం, మూడు పాత్రల స్వభావాలు, బాడీ లాంగ్వేజ్‌ గెటప్‌ నుంచి డైలాగ్‌ డెలివరీ వరకు అన్ని విభిన్నంగా చూపించడం, అది కూడా ఒకే రోజున ఆ పాత్ర పరిచయం ఉండటం విశేషం. 

కాగా సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత దక్షిణాదిలో సూర్య, కమల్‌ హాసన్‌, చిరంజీవి, కృష్ణ వంటి వారు త్రిపాత్రాభినయం చేశారు. వీరిలో కేవలం కమల్‌, సూర్యలే మెప్పించారు. మరి ఈ ట్రిపుల్‌ థమాకాలో ఎన్టీఆర్‌ ఎలా అదరగొట్టనున్నాడో వేచిచూడాల్సివుంది....! 

Jr NTR Jai Lava Kusa Movie Teaser Release on 6th July:

Jr NTR acted movie 'Jai Lava Kusa' teaser Release tomorrow 6th july evening at 5.22 o clock.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ