Advertisementt

ఇలియానా కి ఈ తెలుగు హీరో ఇష్టమట!

Thu 06th Jul 2017 05:55 PM
ileana,tollywood,favorite hero,raviteja  ఇలియానా కి ఈ తెలుగు హీరో ఇష్టమట!
Raviteja is the Ileana's Favorite Telugu Hero ఇలియానా కి ఈ తెలుగు హీరో ఇష్టమట!
Advertisement
Ads by CJ

వైవిఎస్‌ చౌదరి దర్శకత్వంలో రామ్‌ హీరోగా రూపొందిన 'దేవదాసు' ద్వారా నడుమందాల సుందరి, గోవా బ్యూటీ ఇల్లీబేబీ తెలుగులోకి పరిచితమైంది. పవన్‌కళ్యాణ్‌తో జల్సా, మహేష్‌తో పోకిరి, జూనియర్‌ ఎన్టీఆర్‌తో రాఖి, శక్తి, ప్రభాస్ తో మున్నా, అల్లుఅర్జున్‌తో జులాయి, రవితేజ తో కిక్ వంటి చిత్రాలలో నటించింది. ఏకంగా కోటిరూపాయలు పారితోషికంగా అందుకున్న తొలి తెలుగు హీరోయిన్‌గా రికార్డుల కెక్కింది. అంత మంచి పీక్‌ స్టేజీలో బాలీవుడ్‌పై ఆశతో అక్కడికిపోయింది. 

దూరపు కొండలు నునుపు అనే సామెతగా ఆమెకు అక్కడ అవకాశాలులేవు.. వచ్చిన చిత్రాలు ఆడటం లేదు. అయినా కూడా ఈమె ఈ మద్యకాలంలో తెలుగును చిన్నచూపు చూస్తూ ఏవేవో మాట్లాడింది. మరలా ఆమెకు టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం ఏమైనా ఉందేమో గానీ ఈసారి మాత్రం ఆమె టాలీవుడ్‌పై నోరెత్తింది. తాను నటించిన టాలీవుడ్‌ హీరోలందరిలోకి తనకు మాస్‌ మహారాజా రవితేజ అంటే ఇష్టమని తెలిపింది. ఆయనతో ఉంటే సమయమే తెలియదని, ఆయనలోని ఎనర్జీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. 

కాగా రవితేజ-ఇలియానాలు కలసి టాలీవుడ్‌లో 'ఖతర్నాక్‌, కిక్‌, దేవుడు చేసిన మనుషులు'లలో నటించారు. వీటిల్లో 'ఖతర్నాక్‌, దేవుడు చేసిన మనుషులు' ఫ్లాప్‌ కాగా 'కిక్‌' మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతంలో ఆమె నటించిన పెద్ద పెద్ద యంగ్‌స్టార్స్‌ అందరూ ఇప్పుడు కొత్తమ్మాయిలతో జోడీ కడుతుండటంతో వారి నుంచి తనకు ఎలాగూ ఆఫర్లు రావని తెలిసి, రేసులో కాస్త వెనుకబడిన రవితేజను ఛాన్స్ కోసం ఆకాశానికెత్తేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Raviteja is the Ileana's Favorite Telugu Hero:

My Favorite Hero in Tollywood is Raviteja, Says Ileana. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ