Advertisementt

ముగ్గురు హీరోయిన్స్ లో ఎవ్వరూ తగ్గడం లేదు..!

Thu 06th Jul 2017 05:56 PM
regina cassandra,shriya saran,pragya jaiswal,nakshatram movie,sundeep kishan,sai dharam tej,director krishna vamsi  ముగ్గురు హీరోయిన్స్ లో ఎవ్వరూ తగ్గడం లేదు..!
Three Heroines in Nakshatram Movie ముగ్గురు హీరోయిన్స్ లో ఎవ్వరూ తగ్గడం లేదు..!
Advertisement
Ads by CJ

రెజినా కాసాండ్రా కి ఇక్కడ టాలీవుడ్ లో అక్కడ కోలీవుడ్ లో చేతిలో పెద్దగా ఆఫర్స్ లేవు. ఎంతగా అందాల ఆరబోతకు దిగినా కూడా అవకాశాలు లేక అమ్మడు కొట్టుమిట్టాడుతోంది.అయితే ఇప్పుడు ఒకే ఒక్క సినిమాపైనే రెజినా ఆశలు పెట్టుకుంది. కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన 'నక్షత్రం' సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా నటిస్తున్న రెజినా అందాల ఆరబోతతో రెచ్చిపోనుంది. ఇప్పటి వరకు విడుదలైన 'నక్షత్రం' స్టిల్స్ కానివ్వండి... ట్రైలర్ లో కానివ్వండి రెజీనా అందాలు చూస్తుంటే ఈ సినిమాతో రెజీనా మళ్లీ బిజీ అవుతుందేమోలే అంటున్నారు. 

ఇక తాజాగా జరిగిన 'నక్షత్రం' ఆడియో వేడుకలో కూడా రెజినా చీరకట్టులో హాజరైనప్పటికీ ఎంతో అందంగా అందాలను ఆరబోసి గ్లామర్ గా అందరి మతులు పోగొట్టింది. ఇకపోతే ఈ సినిమాలో రెజినాతో పాటు మరో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కూడా నటిస్తుంది. అలాగే ప్రగ్య జైస్వాల్ చేతిలో కూడా ఇప్పుడు చెప్పుకోదగ్గ ఆఫర్స్ అంటూ ఏమిలేకపోయేసరికి ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచేసింది. మరి ప్రగ్య, రెజినా పోటీపడి అందాలు  ఆరబోసినట్లు లేటెస్ట్ గా విడుదల చేసిన 'నక్షత్రం' పోస్టర్స్ లో తెలుస్తుంది. ఇక ఆడియో వేడుకకి వచ్చిన ప్రగ్యా, రెజినాలు పోటీపడి అందాల ప్రదర్శనకు దిగారు.

వీరిద్దరే ఇలా రెచ్చిపోతుంటే మధ్యలో నేనున్నానంటూ 'నక్షత్రం' ఐటెం భామ శ్రీయ అంటుంది. శ్రీయ శరణ్ 'నక్షత్రం' మూవీలో ఐటెంలో నటిస్తుందని తెలిసిన విషయమే. ఇక ఐటెం సాంగ్ అంటే గ్లామర్ షో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అలాగే 'నక్షత్రం' ఆడియో వేడుకకి వచ్చిన శ్రీయ తన అందచందాలతో చూపరుల మతులు పోగొట్టింది. ఇలా ఒకే వేడుకలో ముగ్గురు హీరోయిన్స్ అందాల ఆరబోతతో రెచ్చిపోయారన్నమాట.

Three Heroines in Nakshatram Movie:

Sundeep Kishan and Sai dharam Tej heroes in 'Nakshatram' movie. In this movie director by Krishna Vamsi,this movie audio launch released on 05th july 2017. In this movie three heroines starring Shriya Saran item song role,Regina cassabdra and Pragya Jaiswal heroines roles.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ