Advertisementt

ఈ యాంకర్ చాలా రోజులైనా అదరగొట్టింది..!

Fri 07th Jul 2017 04:16 PM
nakshatram movie,udaya bhanu,nakshatram mvoie audio function,udaya bhanu re entry  ఈ యాంకర్ చాలా రోజులైనా అదరగొట్టింది..!
Anchor Udaya Bhanu Re Entry ఈ యాంకర్ చాలా రోజులైనా అదరగొట్టింది..!
Advertisement
Ads by CJ

నేడు యాంకర్లు, హోస్ట్‌లకు కూడా డిమాండ్‌ పెరిగిపోతోంది. చానెల్స్‌ బాగా పెరగడం, సీరియళ్లతో పాటు రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాలు బాగా పెరగడంతో రోజు కొకరు కొత్తగా వస్తున్నారు. ఇక యాంకర్లే నేడు పలు వేడుకలకు హోస్ట్‌లుగా పనిచేస్తున్నారు. చివరకు అల్లు శిరీష్‌, రానా, విజయ్‌ దేవరకొండ, నాని వంటి వారు కూడా పలు వేదికలపై తమదైన వాక్యాతుర్యంతో ఆకట్టుకుంటున్నారు. 

యాంకర్లు, హోస్ట్‌లకు కూడా ఎక్కడలేని పాపులారిటీ వచ్చేస్తోంది. అయితే ఇది అంత సులభం కాదు. స్పాంటేనియస్‌గా మాట్లాడటం, విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా కష్టంతో కూడుకున్న పనే. ఇక నేటి యాంకర్లు, హోస్ట్‌లలో సుమ, రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటి వారు బాగావేడుకలను నిర్వహిస్తున్నారు. బుల్లితెర పుణ్యమా అని రేష్మి, అనసూయ, శ్రీముఖిలకు వెండితెర చాన్స్‌లు కూడా వస్తున్నాయి. ఇక సుమ కాలం నాటి యాంకర్లలో ఝూన్సీతో పాటు ఉదయభాను కూడా బాగా పాపులర్‌. ఆమె వెండితెరపై కూడా కొన్నిపాత్రలు, ఐటం సాంగ్‌లలో నటించింది. 

కానీ ఈమధ్య ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు తల్లి కావడంతో కనిపించడం మానేసింది. తాజాగా 'నక్షత్రం' ఆడియోవేడుకతో రీఎంట్రీ ఇచ్చింది. తనదైన మాటల చాతుర్యంతో పాటు ఈమె మంచి సెక్స్‌ అప్పీల్‌ ఉన్న నటి. ఈ 'నక్షత్రం' ఆడియో వేడుకలో ఈమె అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం నిర్మాత మైక్‌ తీసుకుని చాలాసేపు మాట్లాడుతుండే సరికి జనాలు గోల చేశారు. 

అదే సమయంలో ఉదయభాను తన మాటకారి తనాన్ని చూపిస్తూ ఆయన నుంచి మైక్‌ తీసుకుని, ఆయన కూడా హర్ట్‌ కాకుండా నా పోస్ట్‌కే ఎసరుపెట్టేలా ఉన్నారే అంటూ నవ్వులు పూయించింది. మొత్తానికి ఇక ఈమె కూడా బిజీ అవ్వడం గ్యారంటీ అనిపిస్తోంది. 

Anchor Udaya Bhanu Re Entry:

Anchor Udaya Bhanu re entry anchoring yesterday 5th July 2017 in Nakshatram Movie Audio Function.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ