ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ప్రోమో లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఇందులో బిగ్ బాస్ కి సంబందించిన విషయాలను ఎన్నో ఎన్టీఆర్ మీడియాతో పంచుకున్నాడు. ఈ షో అంతా 60 కెమెరాల కనుసన్నల్లో నడుస్తుందని... అక్కడ ఏది చేసినా అందరికి తెలిసిపోతుందని చెప్పాడు. అలాగే 70 రోజుల బిగ్ బాస్ లో 12 మంది పార్టిసిపేట్స్ పాల్గొంటున్నారని తెలిపాడు.అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ లో కనబడే పార్టిసిపెంట్స్ మొహాలు కనబడకుండా నడుం దగ్గరనుండి బాడీ ని మాత్రమే చూపిస్తూ ప్రోమో కట్ చేశారు. ఇక ఈ ప్రోమోలో ఎంతటి వారైనా తమ పనులు తామే చేసుకోవాలని మాత్రం హింట్ ఇచ్చారు.
అయితే ఇక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్న తారక్ ని మీడియా మిత్రులు బిగ్ బాస్ కి సంబందించిన ప్రశ్నలతో పాటే పర్సనల్ విషయాలు కూడా చాలానే అడిగారు. అందులో భాగంగా మీరు ఎవరికీ భయపడుతున్నారని ఎన్టీఆర్ ని అడగగానే వెంటనే నా కొడుకు కి, నా భార్యకి అంటూ సమాధానం చెప్పాడు. నా కొడుకు పుట్టిన దగ్గర నుండి అభయ్ తో చాలా క్లోజ్ అయ్యాను. ఇక ఎప్పుడూ నాన్న అంటేనే ఇష్టమని చెప్పే అభయ్ ఇప్పుడు నాకు షాక్ ఇచ్చాడు. ఈ మధ్యన వాడు స్కూల్ కి వెళ్లడం స్టార్ట్ చేశాడు. ఇక నేను షూటింగ్స్ తో బాగా బిజీగా ఉండడం వలన ఉదయం 7 కల్లా వెళ్లి నైట్ లేట్ గా రావడంతో వాడు నేను వెళ్లే సరికి నిద్ర లేవడం లేదు. వచ్చేసరికి నిద్ర పోతున్నాడు.
ఇక ఈరోజు నేను ఇక్కడికి బయలుదేరేటప్పుడు వాడు నిద్ర లేచి నాన్నా అంటూ గట్టిగ కేక వేసేసరికి ఆగి వాడితో కొద్దిగా టైమ్ స్పెండ్ చేసి వచ్చా. అయితే అభయ్ ని నీకు ఎవరంటే ఇష్టం అని అడగ్గా... నాకు అమ్మఅంటే ఇష్టమంటున్నాడు. నేను షూటింగ్ కి వెళ్ళగానే మా ఆవిడ వాడిని తన వైపు తిప్పేసుకుంటుందని సరదాగా నవ్వేశాడు. అలాగే వాడిని తనవైపు తిప్పుకోవడానికి మా ఆవిడా ఎలాంటి టెక్నీక్స్ ఉపయోగిస్తుందో చాటుగా చూసి నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని చమత్కరించాడు.