చైనా మరోసారి భారత్‌పై దూకుడు పెంచింది. వారి దేశ నాయకులు, సైనాధ్యక్షులు భారత్‌ని రెచ్చగొట్టే పనులు, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు చైనా మరింత రెచ్చిపోయింది. 1962లో చైనా చేతిలో భారత్ ఓడిపోయిందనేది వాస్తవం. కానీ నాటి భారత్‌కు నేటిభారత్‌కి చాలా వ్యత్యాసం ఉంది. చైనా 1962 నాటి పరిస్థితులను చూసి భారత్ మౌనంగా ఉండాలని కించపరిచే వ్యాఖ్యలు చేస్తోంది. కానీ అరుణ్‌జైట్లీ మాత్రం నాడున్న భారత్ సైనిక బలం, ఆయుధ సంపత్తి, అత్యాధునిక ఆయుధాలు కంటే నేడు ఎంతో బలంగా తయారైందని చైనాకు తిరుగుసమాధానం చెప్పాడు.
ఇక అణుబాంబ్‌ల విషయంలో రెండు దేశాలు సమతూకంగానే ఉన్నాయి. చైనా భారత్‌పై అణుయుద్దం జరిపితే భారత్ కూడా అంతే గట్టిగా బదులివ్వడానికి రెడీగా ఉంది. ఇదే జరిగితే రెండు దేశాలకు తీవ్ర నష్టం తప్పడు. ఇక చైనాతో పాకిస్థాన్ ఎలాగూ యుద్దం చేయదు. చైనాతో వారిది విడదీయరాని బంధం. ఇద్దరి ఉమ్మడి శత్రువు భారతే. కాబట్టి భారత్‌ని చైనా, పాక్‌లు కలిసికట్టుగా టార్గెట్ చేయవచ్చు. ఇది జరిగితే మాత్రం చైనాను దెబ్బతీయాలని భావిస్తున్న అమెరికాతో పాటు యూఎస్ మిత్రదేశాలు, ఇజ్రాయెల్ వంటివి కూడా భారత్‌నే సపోర్ట్ చేయాల్సివస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బూటాన్, టిబెట్ వంటి విదేశాలు కూడా చైనా-భారత్ యుద్దం వస్తే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా యుద్దం వస్తేమాత్రం అది చినికి చినికి మూడో ప్రపంచ యుద్దానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు ఉత్తరకొరియా అమెరికాను రెచ్చగొడుతుండటం గమనార్హం.