'హ్యాపీడేస్'తో ఎంట్రీ ఇచ్చి, 'యువత'తో ఫర్వాలేదనిపించుకుని, 'స్వామిరారా'నుంచి హీరోగా జైత్రయాత్ర మొదలు పెట్టిన విభిన్న చిత్రాల హీరో నిఖిల్. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో సంచలనం సృష్టించి, పెద్దగా ఆడకపోయినా కూడా 'కేశవ'తో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాడు. రవితేజ, రామ్, నానిలలోని ఎనర్జీని పోలి ఉండే ఈ యంగ్ హీరో తాజాగా రెండు చిత్రాలకు ఓకే చెప్పాడు ఇకటి తమిళ మూవీ 'కనిదన్'కి తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు.
మొదట ఈ ఆఫర్ రవితేజకు వస్తే నో చెప్పాడట. దాంతో నిఖిల్ లైన్‌లోకి వచ్చాడు. తమిళ ఒరిజినల్ దర్శకుడు సంతోషే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన బడా నిర్మాత కళైపులి థాను తెలుగులో కూడా తానే నిర్మించాలని భావిస్తుంటే, ఠాగూర్ మధు, నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి)లు రీమేక్ రైట్స్‌కి భారీ ఆఫర్ ఇస్తున్నాడు. సో.. దీని నిర్మాత ఎవరనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
అదే సమయంలో ఆయన కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'కిర్రాక్ పార్టీ' తెలుగు రీమేక్‌లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. మొత్తానికి రీమేక్‌లైనా సరే మరో రెండు విభిన్న చిత్రాలకు నిఖిల్ ఓకే చెప్పాడు. ఇక 'కనిదన్' రవితేజ చేయాలని, 'కిరాక్ పార్టీ'ని పలువురు యంగ్ హీరోలు చేయాలని భావించినా విభిన్న కథాంశాలతో నిండిన వీటిని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే సంశయంతో వారు వెనకడుగు వేశారు. కానీ విభిన్న కథ అంటే చాలు అక్కడ వాలిపోయే నిఖిల్ ఈ రెండు చిత్రాలతో కూడా హిట్లు కొట్టడం గ్యారంటీ అంటున్నారు.