Advertisementt

'బిగ్‌ బాస్‌'లో ఎన్టీఆర్‌ ఫుల్‌మీల్స్‌..!

Mon 10th Jul 2017 03:54 PM
jr ntr,bigg boss show,star maa,monday to friday 9.30 pm  'బిగ్‌ బాస్‌'లో ఎన్టీఆర్‌ ఫుల్‌మీల్స్‌..!
Jr NTR Full Meals in 'Bigg Boss' Show 'బిగ్‌ బాస్‌'లో ఎన్టీఆర్‌ ఫుల్‌మీల్స్‌..!
Advertisement
Ads by CJ

విదేశాలలోలాగా, హిందీలో లాగా 'బిగ్‌ బాస్‌' షో దక్షిణాదిన క్లిక్‌ కాదని, దీనికి తమిళంలో కమల్‌ హాసన్‌ చేస్తోన్న తమిళ 'బిగ్‌ బాస్‌' ఉదాహరణ అని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం ఈ షో బాగా క్లిక్కయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి కారణం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తుండటమే. కాగా ఎన్టీఆర్‌ అంటే ఆయన అభిమానుల నుంచి సామాన్య ప్రేక్షకులు కూడా అద్భుతమైన డైలాగ్స్‌, డైలాగ్‌ డెలివరీతో పాటు స్టెప్స్‌ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 

ఎన్టీఆర్‌ అదిరిపోయే స్టెప్స్‌ లేవంటే అది ఉప్పులేని పప్పులా, అన్ని వడ్డించినా పసందైన విందుభోజనాన్ని ఫుల్‌మీల్స్‌గా తిన్న అనుభూతి రాదు. దాంతో స్టార్‌ మా యాజమాన్యం 'బిగ్‌ బాస్‌' షోని వైవిధ్యంగా తీర్చిదిద్దుతోంది. తాజాగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ఈ షోలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలుంటాయని హింట్‌ ఇచ్చాడు. ఇక ఈషోలో ఎన్టీఆర్‌ తనదైన డ్యాన్స్‌ని కూడా చేయనున్నాడట. 

ఇక ఇందులో మీ భార్య, మీ కుమారుడు కూడా కనిపిస్తారా? అని అడిగితే అభయ్‌ స్కూల్‌కి వెళ్లున్నాడు. మా ఆవిడ అభయ్‌ ఆలనాపాలనా. ఇతర కుటుంబ వ్యవహారాలల్లో బిజీగా ఉంది. కాబట్టి దాని గురించి ఇప్పుడే చెప్పలేమని తెలిపాడు. ఇక ఈ షో కోసం ఎన్టీఆర్‌ ఏకంగా 70రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొననున్నాడని కూడా వార్తలు వచ్చాయి. వాటిని ఎన్టీఆర్‌ తోసిపుచ్చాడు. ఈ కార్యక్రమంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు కేవలం పార్టిసిపెంట్స్‌ మాత్రమే పాల్గొంటారు. 

శని, ఆదివారాల్లో మాత్రమే హోస్ట్‌నైన తాను కనిపిస్తానని, కాబట్టి అన్నిరోజులు షూటింగ్‌ అనేది నిజం కాదని తేల్చేశాడు. ఇక ఈ షో ఈనెల 16 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30నిమిషాలకు మొదలయ్యే ఈ షో శని, ఆదివారాలు మాత్రం రాత్రి 9గంటలకే ప్రారంభమవుతుంది. 

Jr NTR Full Meals in 'Bigg Boss' Show:

Participants only participate in this program from Monday to Friday.  He is the only host in Saturdays and Sundays, The show will start from 16th of this month. Monday to Friday 9.30 PM. Saturdays and Sundays 9.00 PM.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ