టాలీవుడ్‌లో వారసులని ఆదరించినట్లు వారసురాళ్లని ఆదరించరు. కానీ రాజశేఖర్ మాత్రం తన పెద్ద కూతురు శివానికి సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మద్య రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తీయించుకున్న సెక్సీ ఫొటో షూట్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తన కూతురు ఎంట్రీపై రాజశేఖర్ నోరు విప్పాడు. నా కూతురు సినిమాలలోకి వస్తానంటే కాదనేందుకు నాకు ఒక్క రీజన్ కూడా కనిపించలేదు.
తన ఇష్టాన్ని కాదనే హక్కు నాకు లేదు. ఇక మన సినిమా ఫీల్డ్‌లో హిపోక్రసీ ఎక్కువ. మనం వేరు ఆడిపిల్లల మీద చేయి వేయవచ్చు. వారి జీవితాలతో ఆడుకోవచ్చు. కానీ మన పిల్లలు మాత్రం ఆ దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకునే వారే ఎక్కువ. ఇక శివానీ హీరోయిన్‌గా నటిస్తానని చెబితే నేను అలాగే అన్నాను. కాకపోతే ముందుగా చదువు ముగించు.. తర్వాత హీరోయిన్‌గా మారవచ్చు అని మాత్రమే చెప్పాను. ఇకనేను ఆమెకు మరో సలహా కూడా ఇచ్చాను, నటననే వృత్తిగా స్వీకరిస్తే దెబ్బతింటావు.
ఏదైనా వృత్తిని ఎంచుకుని అది చేస్తూనే నటనను హబీలాగా ఉంచుకోవాలని చెప్పాను, దానికి తను కూడా ఓకే అంది. ఇక నా చిన్నకూతురు కూడా నటిగా మారాలని భావిస్తోంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తానని చెప్పినా నాకు అభ్యంతరం ఉండదు. మన మనస్సాక్షిని నమ్ముకోవాలి. ఇక నాకు కొడుకు ఉండి ఉంటే వాడిని ఖచ్చితంగా హీరో చేసేవాడిని.కానీ ఆ అదృష్టం లేకపోవడంతో కూతుర్లను హీరోయిన్లను చేస్తున్నానని తెలిపాడు.