కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన 'నక్షత్రం' సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూడగానే సినిమా కథ మొత్తం దాదాపు అర్ధమైపోయింది.ఇందులో సందీప్ కిషన్ పోలీస్ అవ్వాలని ఎన్నో కలలు కంటూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ కోరికతోనే అలెగ్జాండర్ (సాయిధరమ్ తేజ్) ప్లేస్ లోకి పోలీస్ గా వెళతాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ ఏమయ్యాడు అంటూ సందీప్ కిషన్ మీద ప్రగ్యా జైస్వాల్ కక్ష పెంచుకుని సందీప్ ని హింసిస్తుండడం వంటి విషయాలు ట్రైలర్ లో చూపించేసిన కృష్ణవంశీ అసలు సినిమా కథ ఇది కాదంట.
సందీప్, రెజీనా జంటగా పోలీస్ మీద కథ రాసుకుని సినిమా తెరకెక్కిస్తున్న కృష్ణవంశీ కి సందీప్ కిషన్ కి వచ్చిన రెండు ప్లాపులని దృష్టిలో పెట్టుకుని సినిమాపై హైప్ తీసుకురావడానికి నక్షత్రంలో సాయి ధరమ్ తేజ్ ని గెస్ట్ గా తీసుకొచ్చాడట. కానీ సాయిధరమ్ కూడా ప్రస్తుతం ప్లాపుల బాటలోనే ఉండడంతో గెస్ట్ పాత్ర కాస్తా సందీప్ తో సరిసమానమైన పాత్ర ఉండేలా నక్షత్రం కథని మార్పులు చేసాడట. ఇక హీరోయిన్స్ విషయంలోనూ అంతేనట. రెజీనా, ప్రగ్యాల వల్ల సినిమాకి ఏమాత్రం క్రేజ్ రాకపోవడం వల్లనే శ్రియతో ఒక ఐటెంకి ప్లాన్ చేసాడట.
ఇక హీరోయిన్స్ తో బాగా గ్లామర్ డోస్ పెంచించిన రాని హైప్ శ్రియ శరణ్ ఐటెం సాంగ్ తో అయినా వస్తుందని కృష్ణవంశీ భావించి ఆమెని ఐటెం సాంగ్ కి తీసుకున్నాడట. మరి కృష్ణవంశీ ఒక కథ ని సినిమా తియ్యాలి అనుకుంటే మధ్యలో ఇన్ని కేరెక్టర్స్ యాడ్ చెయ్యాల్సి రావడంతో ముందు అనుకున్న నక్షత్రం ఒకటి ఇప్పుడు తెరకెక్కిన నక్షత్రం మరొకటి అంటున్నారు. మరి ఎప్పుడూ తాను రాసుకున్న స్క్రిప్ట్ విషయంలో ఎంతో స్ట్రిట్ గా వుండే కృష్ణవంశీ.. పాపం ఇప్పుడు నక్షత్రం సినిమాతో మారాడని అంటున్నారు. అయితే కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే చిత్రమప్పుడు కూడా కథలో మార్పులు చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.