హీరోగా రాజశేఖర్ పరిస్థితి బాగాలేదు. కాగా ఆయన గతంలో రాంగో పాల్ వర్మతో 'పట్టపగలు' చిత్రం చేశాడు. కానీ ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా జనాలు అంగీకరించని ఆ సినిమా పూర్తయినా విడుదల చేయలేదు. ఇక దర్శకుడు తేజా నాకు ఓ కథ చెప్పిన మాట వాస్తవమే.కానీ నేను షూటింగ్‌కి ఆలస్యంగా రావడం వల్ల తేజా కోప్పడి సినిమా ఆపేశాడు అనేది అబద్దం. చాలా మంచి విలన్ పాత్ర అది, కథ, నా క్యారెక్టర్ నచ్చిన క్లైమాక్స్ విషయంలో తేజాకు, నాకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దానిని పక్కనపెట్టేశాం.
రామ్‌చరణ్ నటించిన 'ధృవ' చిత్రంలో విలన్‌గా తమిళంలో అరవింద్ స్వామి చేసిన క్యారెక్టర్ నాకు వచ్చింది. అంతా ఓకే అనుకున్న సమయంలో నిర్మాత ఎన్వీప్రసాద్ తమిళంలో నటించిన అరవింద్ స్వామినే పెట్టుకుంటున్నాం. ఆయనపై తమిళంలో ఉన్న సోలో సీన్స్‌కి తెలుగులో వాడాలని నిర్ణయించాం. మిమ్మల్ని పెట్టుకుంటే ఆ షాట్స్‌ని మరలా రీషూట్ చేయాల్సి వస్తుందని చెప్పడంతో డ్రాప్ అయ్యాను.
ఇక బాలకృష్ణ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న 102 వ చిత్రం 'జయసింహా'లో నన్ను విలన్‌గా పెట్టుకోమని, నాకు కథ వినిపించమని బాలయ్య చెప్పాడట. కానీ అది వైవిధ్యం లేని రొటీన్ విలన్ పాత్ర. ఇక బాలకృష్ణ నాకు బాగా ఆప్తుడు. దాంతో క్యారెక్టర్ నచ్చలేదని చెప్పకుండా, కథే వినలేదని చెప్పాను. కాగా అప్పుడెప్పుడో చిరంజీవి-విజయ్‌కుమార్‌లు కలసి నటించిన 'స్నేహం కోసం' చిత్రంలో చిరంజీవి స్నేహితునిగా నన్నే అనుకున్నారు.
కానీ చిరంజీవి నేను విజయ్ కుమార్ పాత్ర కంటే వయసులో చిన్నగా కనిపిస్తానని భావించాడు. ఇలా విలన్ వేషాలు పోగొట్టుకున్నానే గానీ.. నాకంటూ మంచి విలన్ పాత్ర వస్తే చేయడానికి రెడీ అని చెప్పారు.