Advertisementt

రాజమౌళితో రజినీకాంత్ నిర్మాత..దేనికోసం?

Tue 11th Jul 2017 04:52 PM
ss rajamouli,lyca productions,raju mahalingam,baahubali  రాజమౌళితో రజినీకాంత్ నిర్మాత..దేనికోసం?
Raju Mahalingam Meets SS Rajamouli రాజమౌళితో రజినీకాంత్ నిర్మాత..దేనికోసం?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తమిళంలో 'కత్తి' తర్వాత శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌లు నటిస్తున్న '2.0' ని దాదాపు ప్రమోషన్స్‌తో కలిపి ఏకంగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ 500 కోట్ల తో ఈ చిత్రాన్ని పలు భాషల్లో రూపొందిస్తుంది. ఇక ఈ సంస్థ అధినేతల్లో ఒకరైన రాజుమహాలింగం తాజాగా తెలుగు దర్శకధీరుడు, 'బాహుబలి' రూపశిల్పి రాజమౌళితో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. దీంతో ఈ భేటీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 

త్వరలో భారీ బడ్జెట్‌తో ఈ సంస్థ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బహుభాషల్లో ఓ చిత్రం రూపొందనుందనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఒకవైపు '2.0' తో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ఇరువురి సమావేశం టాలీవుడ్‌లోనే కాదు... దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఇక రాజు మహాలింగం, రాజమౌళిని కలసిన వెంటనే జక్కన్నపై ట్వీట్స్‌చేశాడు. రాజమౌళి ఎంతో వినమ్రత, వినయం కలిగిన వ్యక్తి అని అర్దమైంది. ఆయన హ్యూమానిటీ మెగా సక్సెస్‌ బాహుబలి కంటే గొప్పది.. రెస్పెక్ట్‌ సార్‌... అని ప్రశంసల వర్షం కురిపించాడు. 

ఇక తమ '2.0' హాలీవుడ్‌ చిత్రాలతో సరిసమానంగా, అదే స్థాయిలో ఉంటుందని తెలిపాడు. దీనిని 3డి ఫార్మెట్‌లో కూడా తెరకెక్కిస్తున్నామని, కానీ కేవలం మనదేశంలో 1500 త్రీడీ స్క్రీన్‌లు మాత్రమే ఉన్నాయని, '2.0' నాటికి వాటి సంఖ్య మరింతగా పెరుగుతుందని, ఈ సందర్బంగా ఈ విషయమై బయ్యర్లు, ఎగ్జిబిటర్స్‌తో సమావేశాలు జరుపుతున్నామని, సినిమా జనవరి 25న ఖచ్చితంగా రిలీజ్‌ అవుతుందన్నాడు. 

Raju Mahalingam Meets SS Rajamouli :

2.0 movie producer Raju Mahalingam Tweet on SS Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ