Advertisementt

తాప్సి పై స్కెచ్.. ఈ నిర్మాతల్లో భయం..!

Tue 11th Jul 2017 05:55 PM
tapsee,taapsi,anando brahma,k raghavendra rao,tollywood  తాప్సి పై స్కెచ్.. ఈ నిర్మాతల్లో భయం..!
Tollywood to take Serious Action on Heroine Tapsee తాప్సి పై స్కెచ్.. ఈ నిర్మాతల్లో భయం..!
Advertisement
Ads by CJ

ఈ మధ్యన హీరోయిన్ తాప్సి నోరు బాగా లేస్తుంది. ఎలాబడితే అలా మాట్లాడుతుంది. ఏదో బాలీవుడ్ లో రెండు సినిమాలు హిట్ పడగానే ఈ భామకి కళ్ళు నెత్తిమీదకొచ్చేశాయి. తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ నే అనరాని మాటలనేసింది. అందులోను దక్షిణాదిన హీరోయిన్స్ అందాలతోనే సినిమాలు తెరకెక్కిస్తారనే మాటలు మాట్లాడి ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు శత్రువవ్వడమే గాక ఏకంగా తెలుగు ఇండస్ట్రీకి శత్రువైంది.  అసలు నటన కూడా సరిగ్గా చేతగాని ఈవిడగారు ఏదో కాస్త గ్లామర్ చూపిస్తూ సినిమాల్లో నెట్టుకొచ్చేసింది. అవి హిట్ అవ్వకపోయేసరికి టాలీవుడ్ దర్శకుల్ని చులకన చేసి మాట్లాడేసింది. ఇక ఆ మాటలకు టాలీవుడ్ ఏకమై తాప్సికి పట్టిన తుప్పు వదిలించేందుకు సిద్ధమవుతోంది. 

టాలీవుడ్ లో గొప్ప దర్శకుడైన కె రాఘవేంద్రరావు ని అనరానిమాటలన్న తాప్సి... ఆయన కేవలం హీరోయిన్ నాభి అందాలు మాత్రమే చూస్తాడని.... ఎప్పుడు ఎవరి బొడ్డు మీద ఏమేసి కొట్టాలనే ఆలోచన తప్ప మరేం లేదంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి అలాంటి దర్శకుడిని కించపరిచినందుకు టాలీవుడ్.. తాప్సి పై బహిరంగంగానే ఆగ్రహించింది. అయితే ఇంత చేసిన తాప్సి సినిమా ఒకటి టాలీవుడ్ లో విడుదలకు రెడీ అవుతుంది. అదే తాప్సి మెయిన్ లీడ్ లో నటించిన 'ఆనందో బ్రహ్మ'. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. మరి సినిమా విడుదల అంటే తాప్సి గారు పబ్లిసిటీకి రావాలిగా. అలా వచ్చిన  తాప్సిని మీడియా మరియు టాలీవుడ్ కూడా వెలివెయ్యడానికి రెడీగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

తాప్సి గనక హైదరాబాద్ లో అడుగుపెడితే ఆమెను మీడియా కూడా బాయ్ కట్ చెయ్యాలని చూస్తుంది. అసలు ఒకవేళ తాప్సి వస్తే గనక ఆమె అన్న మాటలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వివరణ ఇచ్చినా వీరు వెనక్కి తగ్గే ఆలోచన లేదనట్లుగా వుంది వ్యవహారం. ఇక ఇది విన్న 'ఆనందో బ్రహ్మ' నిర్మాతలకు గుండెల్లో రాయి పడిందట. ఎందుకంటే తాప్సిని బాయ్ కట్ చేస్తేగనక తమ సినిమా కి ప్రమోషన్ లేకుండా పోతుంది. కాబట్టి సినిమా హుష్ కాకి అవుతుందేమో అని 'ఆనందో బ్రహ్మ' నిర్మాతలు హడలి పోతున్నారు. మరి తాప్సి చేసిన ఈ ఓవరేక్షన్ కి ఆనందో... నిర్మాతలు బలికావడం తప్పదంటున్నారు సదరు ప్రేక్షకులు.

Tollywood to take Serious Action on Heroine Tapsee:

Tollywood's iron leg heroine Taapsi has turned out to be an arrogant. Moreover, she shamelessly exhibited her ingratitude on Darshakendrudu K Raghavendra Rao and Tollywood throwing satires on KRR.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ