మెగా ఫ్యామిలీకి రహదారి వేసింది మెగాస్టార్ చిరంజీవి. ఇక బ్రహ్మానందం చెప్పినట్లు ఇష్టమున్న వారు ఇష్టమున్నంతగా ఆయనను వాడుకోవచ్చు. పవన్ మొదటి సినిమాలో కాస్త ఆ ఛాయలే కనిపించాయి. కానీ తర్వాతి చిత్రం నుంచే తన పంధా మార్చి, తనకంటూ ఓ సపరేట్ స్టైల్, ఇమేజ్ తెచ్చుకున్నాడు. పవన్ అభిమానుల్లో అందరూ మెగాభిమానులే అనడానికి వీలుకాదు. సొంతగా ఆయన నటన, వ్యక్తిత్వం నచ్చిన వారు కూడా న్యూట్రల్‌గా ఉండేవారు కూడా ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు.
ఇక అల్లు అర్జున్ నటించిన 'గంగోత్రి' నుంచి 'హ్యాపీ' తర్వాత కూడా చిరుని, పవన్‌ని కాపీ పేస్ట్ చేసేవాడు. ఇక చరణ్ ది 'ధృవ' ముందు వరకు ఇదే స్థితి. ఇప్పుడు 'ధృవ,రంగస్థలం-1985'లలో కాస్త మార్పు కనిపించేలా అగుపిస్తోంది. ఇక సాయి ధరమ్ తేజ్ మేనరిజమ్స్ నుంచి, స్టెప్పులు, ఫైట్స్.. గట్రా అన్ని ఎవరు విమర్శించినా తనదైన దారిలోనే వెళ్తున్నాడు. వారిని ఇమిటేట్ చేయడం ఆపడం లేదు.
ఉన్నవారిలో మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమాల ఎంపిక నుంచి నటన వరకు తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్నాడని 'ముకుందా', 'కంచె' చూసిన వారికి అర్ధమవుతుంది. మరోవైపు ఆయన 'లోఫర్, మిస్టర్'ల ఫ్లాప్‌లలో సతమతమవుతున్నాడు. ఇక వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తాడనే పేరుకు ఈ రెండు చిత్రాలు గండికొట్టాయి. దాంతో ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ముల వంటి సెన్సిబుల్ డైరెక్టర్‌తో దిల్‌రాజు నిర్మాతగా 'ఫిదా' చేస్తున్నాడు.
ఈ ఆడియో రిలీజ్ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తమ ఫ్యామిలీకి చెందిన వారు ఎవ్వరూ రాకపోయినా అభిమానులు బాగా వచ్చి సంతోషం కలిగించారన్నాడు. రెండు మూడు తప్పటడుగులు వేశాను. ఇకపై అలాంటి మిస్టేక్స్ చేయనని హామీ ఇచ్చాడు. ఇక తనకు మొదటి నుంచి పెదనాన్న చిరంజీవి ఆదర్శమని, ఆ తర్వాత పవన్ బాబాయ్‌ని కూడా స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపాడు.
ఇక ఈ చిత్రంలో బాబాయ్ పవన్‌ని ఉద్దేశించి రెండు మూడు చోట్ల డైలాగులు ఉంటాయి. అవి మీకు కూడా నచ్చుతాయి. మెగాభిమానుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. మీరంతా తలలు ఎత్తుకోనేలా చేస్తాను. అంటూ పవన్ బాబాయ్ మాదిరే జైహింద్ అంటూ చివరలో చెప్పి ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.