'అ.. ఆ' తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం 'లై'. హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్, మేఘ ఆకాష్ తో జోడి కడుతున్నాడు. ఇందులో సీనియర్ హీరో అర్జున్ కూడా ఒక విభిన్నమైన కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ చాలా కొత్తగా కనబడుతున్నాడు. ఇక ఎప్పటి నుండో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టర్స్ తో ఆకట్టుకుంటున్న 'లై' టీజర్ ని మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పుట్టిన రోజు కానుకగా విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ టీజర్ లో నితిన్ చాలా కొత్తగా స్టయిల్ గా కనబడుతున్నాడు. ఇక బ్యాగ్రౌండ్ లో సాక్షాత్తూ పాండవులు సైతం అబద్దం ఆడితేనే యుద్దం గెలవగలిగారు. శ్రీకృష్ణుడు అంతటోడే అబద్దం ఆడించాడు. అశ్వద్దామ హతః కుంజరహా అంటూ వాయిస్ ఓవర్ వస్తుంటే... ఈ లోపు అర్జున్ స్టైలిష్ గా బాత్ టబ్ నుండి రావడం.... నితిన్ కూడా అదిరిపోయే స్టయిల్లో యాక్షన్ సీన్లతో అదరగొట్టేశాడు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని మణిశర్మ అరిపించేశాడు. మరి ప్రపంచంలో అబద్దానికి ఉండే పవర్ ని టీజర్ లో పరిచయం చేసిన డైరెక్టర్ హీరోయిన్ మేఘ ఆకాష్ ని మాత్రం పరిచయం చెయ్యలేదు.
మరి 'లై' కథ ఎలా వుండబోతుందో అని కన్ఫ్యూషన్ కి గురవుతున్న అభిమానులకి ఈ టీజర్ తో కాస్త క్లారిటీ ఇచ్చేశాడు నితిన్. ఈ ఒక్క టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు పెంచేశాడు. అదిరిపోయే లుక్ తో నితిన్ బాగా ఆకట్టుకుంటున్నాడు. గత సినిమాల లుక్ కి ఇప్పుడు 'లై' లోని నితిన్ లుక్ కి 100 పెర్సెంట్ మేకోవర్ కనబడుతుంది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు లో రిలీజ్ కి సిద్ధమవుతోంది.