Advertisementt

'కురుక్షేత్ర' కోసం గాలింపు..!

Thu 13th Jul 2017 04:25 PM
hariprriya,kannada star dharshan,ravi chandran,kurukshetra movie,shooting start on 30th july 2017  'కురుక్షేత్ర' కోసం గాలింపు..!
Manhunt For Kannada Film Kurukshetra 'కురుక్షేత్ర' కోసం గాలింపు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కన్నడలో కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా నటిస్తున్న 50వ చిత్రం 'కురుక్షేత్ర'. భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవ్వరూ నిర్మించనంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుండటం విశేషం.ఇప్పటికే ఈ చిత్రంలో నటించేందుకు కన్నడ స్టార్‌ రవి చంద్రన్‌ ఓకే చెప్పాడు. ఇందులో ఆయన శ్రీకృష్ణుని పాత్రను పోషించనున్నాడు. 

తాజాగా మరో క్రేజీ నటి హరి ప్రియను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. అయితే ఆమె ఏ పాత్రలో నటించనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఆమె పాత్ర ఉంటుందని, చిత్రం చూసిన అందరూ ఆ పాత్రను చూసి షాక్‌కి గురవుతారని యూనిట్‌ చెబుతోంది. కాగా ఈనెల 30 వ తేదీన ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. హరి ప్రియను తీసుకున్న విషయాన్ని యూనిట్‌ దృవీకరించింది. ఇక ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుండటంతో ఇందులో పలువురు ఇతర భాషల స్టార్లను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కన్నడ సినీ చరిత్రలో ఎవ్వరూ ఊహించలేని విధంగా, భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలోని తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపికలో నిర్మాతలు బిజీ బిజీగా ఉన్నారు. 'బాహుబలి' తర్వాత శాండల్‌ వుడ్‌ కూడా తానేమీ తక్కువ తినలేదని నిరూపించుకోవాలని ఈ భారీ ప్రాజక్ట్‌కి శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది.తమిళంలో 'సంఘమిత్ర', మలయాళంలో మహాభారతం ఆధారంగా రూపొందనున్న 'రాండాముజం'లను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. 

Manhunt For Kannada Film Kurukshetra:

Kannada Star Dharshan acting 50th Movie 'Kurukshetra' in this film kannada star Ravi Chandran also acted in krishna role. and actress Hari Priya also acted in this movie different role. The movie shooting start on 30th july. Producers are busy busy with the choice of technicians.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ