ఒకప్పుడు డాక్టర్ రామానాయుడు బతికి నిర్మాతగా బిజీగా ఉన్నప్పుడు ఆయనకంటూ కొందరు దర్శకులు ఉండేవారు. ఆయన కొత్త దర్శకులెవ్వరి కథ నచ్చకపోతే ఓ మురళీ మోహన్‌రావునో, ఉదయ్ శంకర్ లేదా ముప్పలనేని శివ వంటి వారితోనే చిత్రాలను గ్యాప్ లేకుండా చేస్తూ ఉండేవాడు. కాబట్టే ఆయన తన బేనర్‌లో ఎవ్వరికి సాధ్యం కాని, ఇకపై కూడా ఎవ్వరూ చేరుకోని విధంగా ఏకంగా 100కు పైగా చిత్రాలను నిర్మించి, గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు.
దిల్‌రాజు వంటి నిర్మాత కూడా అందరూ సహకరిస్తే 50 చిత్రాలను నిర్మించగలనని కానీ సెంచరీ చేయడం తన వల్ల కాదని చెప్పాడు.కానీ రామానాయుడు వంటి డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత కొడుకైన సురేష్‌బాబు తన తండ్రికి వయసు మీరిన సమయంలో కూడా ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఏడాదికి ఒక చిత్రం చేస్తే ఎక్కువ అనే పేరు తెచ్చుకున్నాడు.
అయినా హిట్లుతీశాడా? అంటే అదీలేదు. అన్నీ బలాదూర్, భీమవరం బుల్లోడు వంటి చిత్రాలే. ఇక తన సోదరుడు వెంకటేష్‌తో పాటు ఆయన కుమారుడు రానా రూపంలో, అలాగే నాగ చైతన్య వంటి హీరోలు ఆయన కాంపౌండ్‌లోనే ఉన్నా.. కొందరితో రీమేక్ చిత్రాలను, అదీ భాగస్వామ్యంతో కలిసి నిర్మిస్తున్నాడు. కథను ఎంతకీ ఫైనలైజ్ చేయడని, పూర్తిస్క్రిప్ట్‌ను లాక్ చేసిన తర్వాత కూడా షూటింగ్ సమయంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తాడని, పిసినారి అనే పేరు తెచ్చుకున్నాడు.
ఒకవైపు తన కొడుకు కోసం కోట్లను నీళ్లలా ఖర్చుపెట్టే బెల్లంకొండ సురేష్‌లు ఉన్నరోజుల్లో ఆయన ఈమద్య చిన్నచిత్రంగా వచ్చిన 'పెళ్లిచూపులు' ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక 'ప్రేమ ఇష్క్ కాదల్' నుంచి నిన్నటి కాబిల్ దాకా పెద్దగా అచ్చిరాలేదు. ఎట్టకేలకు తేజకు ఓకే చెప్పి తక్కువ బడ్జెట్‌లోనే 'నేనే రాజు నేనే మంత్రి'నిర్మిస్తున్నాడు. కాగా ప్రస్తుతం తాజాగా ఆయన 'పెళ్లిచూపులు'ఫేమ్ తరుణ్ భాస్కర్‌తో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం.