స్టార్స్ దర్శకులను తయారు చేయలేరు గానీ దర్శకులు కావాలంటే ఎందరినో స్టార్స్‌ని సృష్టించగలరు.. అనేది ఎప్పటి నుంచో ఉన్న మాట. ఇది నిజం కూడా. కాగా కొందరు దర్శకులకు అవకాశం ఇస్తామని చెప్పి, వారి చేత స్క్రిప్ట్‌తో పాటు పలు విధాలుగా వాడుకుని, చివరకు ఆ దర్శకుడితో సినిమాను ఆపేసి తర్వాత చూద్దాంలే అని కొందరు స్టార్స్ భావిస్తుంటారు. వాస్తవానికి నటుని కంటే దర్శకుడే రియలైన క్రియేటర్.
కానీ స్టార్స్‌ని పూజించే కాలం కావడంతో దర్శకుల పరిస్థితి బాగాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తోంది. దర్శకులు కూడా తమ పేరుతోనే హీరో ఎవరైనా సరే తమకోసం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేలా చేస్తున్నారు. నాటి దాసరి తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్‌లతో పాటు కొరటాల శివ కూడా ఆ లిస్ట్‌లో చేరాడు. సెకండ్ సినిమా సెంటిమెంట్లను అన్నింటినీ అధిగమించి 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్'లతో తొలి మూడు చిత్రాల ద్వారానే స్టార్ స్టేటస్ తెచ్చుకుని, తన సత్తా చాటాడు.
'మిర్చి' తర్వాత ఆయనతో ఓ సినిమా కూడా ప్రారంభించిన రామ్ చరణ్ ధరణిలాగానే కొరటాలను భావించి తర్వాత చూద్దాంలే అని ఆ సినిమాను పక్కనపెట్టాడు. ఇప్పుడు అదే దర్శకునితో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. మరోపక్క చేసిన హీరోలైన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారే మరలా ఆయనతో రెండో చిత్రాలను చేయలని తెగ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్‌తో రెండో సినిమాగా 'భరత్ అనే నేను' చిత్రం చేస్తున్నాడు.
మరోపక్క చరణ్ సుక్కుతో 'రంగస్థలం 1985' చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయి తర్వాత తన కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిరంజన్ రెడ్డిని భాగస్వామిగా చేసుకుని చరణ్ కొరటాలతో ఓకే అయ్యాడు. కానీ ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా కొరటాల తన సమయం ఇప్పుడొచ్చిందని భావించి ఏకంగా 15కోట్ల ప్యాకేజీని కోరాడని సమాచారం. తప్పదు కదా...! ఒకప్పుడు అవమానించాడు కాబట్టి ఇప్పుడు ఆ మాత్రం పెనాల్టీ పడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.