Advertisementt

అప్పుడే బాలీవుడ్‌ వైపు చూస్తున్న దర్శకుడు...?

Tue 18th Jul 2017 05:21 PM
director sriwass,bellamkonda sai sreenivas,bollywood,tiger shroff  అప్పుడే బాలీవుడ్‌ వైపు చూస్తున్న దర్శకుడు...?
Director Sriwass Focus on Bollywood అప్పుడే బాలీవుడ్‌ వైపు చూస్తున్న దర్శకుడు...?
Advertisement
Ads by CJ

దర్శకుడు శ్రీవాస్‌ తన 'లక్ష్యం'తో హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత 'పాండవులు పాండవులు తుమ్మెద'తో పాటు 'లౌక్యం'తో తనలో హాస్యాన్ని కూడా పలికించే సత్తా ఉందని చాటాడు, ఇక ఆయన బాలకృష్ణతో 'డిక్టేటర్‌' చేస్తున్నప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో కూడా తీస్తానని చెప్పాడు. కానీ ఈ చిత్రం ఆడలేదు. తాజాగా ఆయనకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో అవకాశం వచ్చింది. ప్రస్తుతం బోయపాటిశ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటిస్తున్న 'జయ జానకి నాయక' చిత్రం ఆగష్టు11న విడుదలకానుంది. 

ఆ వెంటనే ఆల్‌రెడీ ముహూర్తం జరుపుకున్న శ్రీవాస్‌- బెల్లంకొండల సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ చిత్రం కోసం తాను ఓ యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ని రెడీ చేశానని శ్రీవాస్‌ అంటున్నాడు. ఈ కథను ఏ భాషల్లో, ఏ హీరోతో చేసినా అన్ని భాషల్లో హిట్టవుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఆయన ఉన్నాడు. సో.. ఈ బెల్లంకొండ సాయితో.. శ్రీనివాస్‌ చేసే చిత్రం కథనే బాలీవుడ్‌లో టైగర్‌ ష్రాఫ్‌తో తీయాలని డిసైడ్‌ అయ్యాడట. 

త్వరలోనే టైగర్‌ ష్రాఫ్‌ని, జాకీ ష్రాఫ్‌ని కలిసి స్టోరీ చెపనున్నాడని సమాచారం. అయినా ఇప్పటికీ తెలుగులో ఒక చిత్రం హిట్టయితే రెండు వరుస ఫ్లాప్‌లు ఇచ్చే నిలకడ లేని శ్రీవాస్‌ ఇప్పుడే బాలీవుడ్‌పై కన్నేయడం సరికాదనిపిస్తోంది. కాగా శ్రీవాస్‌ కోటీశ్వరుడని, ఆయన తన చిత్రాలలో నిర్మాతలుగా వేరేవారి పేర్లు వేసినా ఎక్కువ పెట్టుబడి తానే సొంతంగా పెట్టే స్థోమత ఉండటమే ఆయన ఇంకా కెరీర్‌ను నెట్టుకురావడానికి కారణం అని కొందరు అంటూ ఉంటారు. మరి ఈయన బాలీవుడ్‌ కల ఫలిస్తుందో లేదో చూడాలి...! 

Director Sriwass Focus on Bollywood:

Sriwass is doing this with a tiger Shroff in Bollywood.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ