Advertisementt

డ్రగ్స్ రాకెట్: ఏ డేట్ కి ఎవరిపై విచారణ..?

Tue 18th Jul 2017 06:48 PM
special investigation team,drugs scandal,tollywood,drugs racket,puri jagannadh,raviteja  డ్రగ్స్ రాకెట్: ఏ డేట్ కి ఎవరిపై విచారణ..?
Tollywood's Celebs to Attend Before SIT on These Dates డ్రగ్స్ రాకెట్: ఏ డేట్ కి ఎవరిపై విచారణ..?
Advertisement
Ads by CJ

నాలుగు రోజుల కిందట సినిమా ఇండస్ట్రీలోని 12  మందికి డ్రగ్ కేసులో నోటీసులు పంపిన ఎక్సయిజ్ శాఖ, నోటీసులు అందుకున్న వారిని తమ కార్యాలయానికి వచ్చి విచారణలో పాల్గొనాలని ఆ నోటీసులో పేర్కొంది. ఆ నోటీసులు అందుకున్న వారిలో పూరి, రవితేజ, ఛార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, నవదీప్, తనీష్, తరుణ్, నందు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, శ్యామ్‌ కే నాయుడు ఉన్నారు.  అయితే నోటీసులు పంపిన వారికి కొంతమంది ఈ డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు.... లేకపోతె అనుమానితులుగా ఉండచ్చు అంతేగాని నోటీసులు అందుకున్నవారంతా దోషులు కారని అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది నోటీసులు అందుకున్నవారు మాత్రం తమకు ఈ డ్రగ్ కేసులో ఎటువంటి సంబంధం లేదంటుంటే కొంతమంది మాత్రం తమకి నోటీసులు వచ్చాయని విచారణ ధైర్యంగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. అసలు కొంతమంది అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు. 

నోటీసులు అందుకున్న ఆ 12 మంది సిట్ ఎదుట హాజరు కావటానికి టైం ని సెట్ చేసి నోటీసులు అందుకున్నవారికి ఇన్ఫార్మ్ చేసినట్టు చెబుతున్నారు. ఆ నోటీసులు అందుకున్న సెలబ్రిటీస్ అందరికి ఒక్కో డేట్ ను కేటాయించారు అధికారులు. ముందుగా ఈ నెల 19 న డైరెక్టర్ పూరి జగన్నాధ్ సిట్ విచారణకు హాజరుకానున్నారు. చార్మిని 20న, ముమైత్‌ఖాన్‌ను 21న సిట్‌ విచారించనుంది. సుబ్బరాజు 22న, శ్యామ్‌కే నాయుడు 23న, హీరో రవితేజ 24న, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా 25న, నవదీప్‌ 26న, తరుణ్‌ 27న, నందు, తనీష్‌లను 28న సిట్ అధికారులు విచారించనున్నారు. 

ఇక సిట్ అధికారులు ఆయా డేట్స్ లో వారిని ఉదయం 10  గంటలనుండి తమ విచారణను మొదలుపెడతారని తెలుస్తుంది. ఇకపోతే ఈ 12  మంది సిట్ ఎదుట హాజరై ఎటువంటి విచారణ ఎదొర్కొనబోతున్నారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇక వీరి గొడవ ఇలా ఉంటె సిట్ అధికారులు మరో 7 గురు సెలబ్రిటీస్ కి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని .... వారికీ గనక నోటీసులు అందితే ఇండస్ట్రీ అతలాకుతలం అవుతుందని అంటున్నారు. ఆ రెండవ లిస్టులో ప్రముఖ నిర్మాత, మరో నిర్మాతకు చెందిన కుటుంబసభ్యులు ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అంతే కాకుండా ఓ యువ సంగీత దర్శకుడు కూడా ఈ రెండో లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Tollywood's Celebs to Attend Before SIT on These Dates:

Tollywood received a huge jolt with Drugs Scandal. As of now, 12 celebs have received notices to attend before Special Investigation Team (SIT). And the schedule has been released by SIT to interrogate all the celebs. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ