Advertisementt

ఆ మల్టీస్టారర్‌ ఖాయమేనంటున్నారు..!

Wed 19th Jul 2017 02:25 PM
nagarjuna,nani,director chandu mondeti,nag and nani combo movie final  ఆ మల్టీస్టారర్‌ ఖాయమేనంటున్నారు..!
Nagarjuna and Nani Combination Movie Fix ఆ మల్టీస్టారర్‌ ఖాయమేనంటున్నారు..!
Advertisement
Ads by CJ

తెలుగు చిత్రాలలో ఇప్పుడు ఒకేస్థాయి కలిగిన యంగ్‌ హీరోలు కలిసి మల్టీ హీరోల చిత్రాలు చేస్తున్నారు. తాజాగా నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది సాయికుమార్‌ల చిత్రం 'శమంతకమణి'ని కూడా మల్టీస్టారర్‌ అనలేం గానీ మల్టీ హీరోల చిత్రంగా చెప్పవచ్చు. ఇక ఓ సీనియర్‌ స్టార్‌, మరో యంగ్‌స్టార్‌లు కలిసిన చిత్రాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, మసాలా, ఊపిరి' వంటివి వస్తున్నాయి. 

కాగా చాలా కాలం కిందట సీనియర్‌ స్టార్‌ కింగ్‌ నాగార్జున, నేచురల్‌స్టార్‌ నానిల కాంబినేషన్‌లో ఓ చిత్రం వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా అది కన్‌ఫర్మ్‌ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కానీ డైరెక్టర్‌ విషయంలో మాత్రం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రం కథని తానే స్వయంగా చేసుకుని,నాగార్జున,నానిలకు చెప్పి ఓకే చేయించింది మాత్రం 'కార్తికేయ, ప్రేమమ్‌' చిత్రాల దర్శకుడు చందుమొండేటి అని విశ్వసనీయ సమాచారం. 

గతంలో 'ప్రేమమ్‌' వంటి సబ్జెక్ట్‌ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చేసిన చందుమొండేటితో ఓ చిత్రం చేస్తానని కూడా నాగార్జున చెప్పాడు. అయితే చందు మొండేటికి ఇప్పటికీ ఓ పెద్దస్టార్‌ని డైరెక్ట్‌ చేసిన అనుభవం లేదు. ఇక ఆయన తీసిన రెండు చిత్రాలను కేవలం హిట్సే గానీ బ్లాక్‌బస్టర్స్‌ కాదు. కానీ దర్శకుల విషయంలో నాగ్‌ని, నానిది ఒకటే టేస్ట్‌, టాలెంట్‌ ఉంటే ట్రాక్‌రికార్డుతో సంబంధం లేకుండా చాన్స్‌లు ఇస్తారు. దీంతో ఈ చిత్రానికి చందుమొండేటే దర్శకుడని అంటున్నారు. 

Nagarjuna and Nani Combination Movie Fix:

Nagarjuna and natural star Nani combined movie is fix. In this movie Director and writer Chandu Momdeti.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ