Advertisementt

సునీల్‌ మరలా కమెడియన్‌ కానున్నాడా..?

Wed 19th Jul 2017 03:16 PM
comedian sunil,trivikram srinivas,pawan kalyan,chiranjeevi,ungarala rambabu movie  సునీల్‌ మరలా కమెడియన్‌ కానున్నాడా..?
Sunil is a Re-Entry of Comedian? సునీల్‌ మరలా కమెడియన్‌ కానున్నాడా..?
Advertisement
Ads by CJ

కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో, క్రేజ్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు సునీల్‌ హీరోగా మారాడు. మొదట్లో తనకి అచ్చివచ్చిన 'అందాల రాముడు', 'మర్యాద రామన్న', పూలరంగడు'లతో హిట్స్‌ కొట్టాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఎవరి మాట విన్నాడో గానీ మాస్‌ జపం చేశాడు. 'తడాఖా' హిట్టయినా అది ఆయన ఒక్కడి క్రెడిట్‌ కాదు. నాగ చైతన్యది కీరోల్‌. ఇక ఆ తర్వాత అన్ని ఫ్లాప్‌లే. 

దిల్‌రాజు, సురేష్‌బాబు వంటి నిర్మాతలు కూడా ఆయనకి హిట్టివ్వలేకపోయారు. ఇక ఆయన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు' చేస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి చాలా రోజులే అయింది. ఇంకా ఫైనాన్స్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల పోస్ట్‌ ప్రొడక్షన్‌ మొదలు పెట్టలేదు. కొత్తగా అప్పిచ్చే ఫైనాన్షియర్స్‌ దొరకడం లేదు. మరోవైపు సినిమా బిజినెస్‌ అసలు కాలేదు. కాగా సునీల్‌కి చిరంజీవి 150వ ప్రతిష్టాత్మక రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నెంబర్‌150'లో చాన్స్‌ వచ్చింది. 

చిరంజీవి 150వ చిత్రంలో నటించాలని ఎందరో కలలు కన్నారు. కానీ ఆ అవకాశం వచ్చినా సునీల్‌ కాలదన్నుకున్నాడు. ఇక పవన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల చిత్రంలో కూడా త్రివిక్రమ్‌ తన క్లోజ్‌ఫ్రెండ్‌ అయిన సునీల్‌కి ఓ మంచి క్యారెక్టర్‌ సృష్టించినా నో అని చెప్పి హీరోగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం సునీల్‌ ప్రస్తుతం తాను కమిట్‌ అయిన చిత్రాలను పూర్తి చేసి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ చేయబోయే తదుపరి చిత్రంలో హీరో ఎవరైనా సరే తనకు ఓ మంచి పాత్రను సృష్టిస్తే మరలా కమెడియన్‌గా రీఎంట్రీ ఇస్తానని త్రివిక్రమ్‌ని కలిసి చెప్పినట్లు సమాచారం. 

Sunil is a Re-Entry of Comedian?:

Now, Sunil will be completing the films that he has committed and Trivikram Srinivas will be directing the next movie and the hero told him that he would give a re entring of the comedian again to Trivikram.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ