Advertisementt

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైందట..!

Thu 20th Jul 2017 05:31 PM
rajasekhar,daughter shivani,heroine entry,shivani approach quan talent agency  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైందట..!
Rajasekhar Daughter Shivani Ready for Heroine Entry హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైందట..!
Advertisement
Ads by CJ

హీరో రాజశేఖర్ కూతురు శివాని డాక్టర్ డిగ్రీని పూర్తి చేసి ఇపుడు హీరోయిన్ గా తెలుగు, తమిళంలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఎప్పటి నుండో హీరోయిన్ కావాలని ఆశపడుతున్న శివాని ఇప్పుడు ఫోటోషూట్స్ గట్రా చేయించుకుంటూ ఫిలిం ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టింది.ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీస్ లో ప్రముఖుల కొడుకులు మాత్రమే సినిమా ఇండస్ట్రీలకు పరిచయమవుతుంటారు. కానీ ప్రముఖుల కూతురులు మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి బాగా జంకుతారు.

కొంచెం బాలీవుడ్ లో మాత్రం ప్రముఖ సెలబ్రిటీస్ కూతుర్లు కూడా సినిమాల్లోకి వచ్చేయడానికి ఇంట్రెస్ట్ చూపడమే కాదు... అంతే ఫాస్ట్ గా ఎంట్రీ కూడా ఇచ్చేస్తుంటారు. కానీ టాలీవుడ్ లో అలా కాదు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు అంటే అదో పెద్ద నేరమంటూ లెక్కేస్తారు. అయితే ఇప్పుడు అన్నిటికి సిద్దమై రాజశేఖర్ కూతురు శివాని సినిమా రంగంలోకి వచ్చేసింది. అయితే శివాని కేవలం తల్లితండ్రుల మీదే ఆధారపడకుండా తనకి తానే అన్ని విషయాలను చక్కబెట్టేసుకుంటుందట.

నటిగా మారాలనుకుని చాలాకాలం నుండి అనుకుంటున్న శివాని అందుకోసం ఒక సెలిబ్రిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీను కూడా సంప్రదించిందట. క్వాన్ అనే  టాలెంట్ ఏజెన్సీతో శివాని ఒక ఒప్పందం కుదుర్చుకుందట అయితే ఆ టాలెంట్ ఏజెన్సీకి బాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రికి అవసరమైన టాలెంట్ ని వెతకటంలో మంచి పేరు ఉందట. ఇక శివాని ఈ మద్యనే ఒక మీడియా హౌస్ వాళ్ళతో కలిసి ఫోటో షూట్ కూడా చేసిందట.

ఇక తమిళం, తెలుగు భాషల్లో గట్టి పట్టున్న ఈ డాక్టర్ శివాని తన విషయంలో తన తల్లితండ్రులు ఎప్పుడూ తలదూర్చరని.... ఏ విషయాన్నీ అయినా తన నిర్ణయానికే వదిలేస్తారని....ప్రతి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెబుతుంది. 

Rajasekhar Daughter Shivani Ready for Heroine Entry:

But Shivani is not just dependent on his parent's, but he does all his own things.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ