Advertisementt

డ్రగ్స్‌ విషయంలో అయోమయం....!

Fri 21st Jul 2017 04:21 PM
puri jagannadh,drugs case,sit police,blood samples  డ్రగ్స్‌ విషయంలో అయోమయం....!
Confused in the Case of Drugs డ్రగ్స్‌ విషయంలో అయోమయం....!
Advertisement
Ads by CJ

వైద్యులు, పరిశోధకులు చెప్పేదాని ప్రకారం ఏ వ్యక్తైనా డ్రగ్స్‌ తీసుకుంటే నాలుగు రోజుల లోపయితేనే రక్తం శాంపిల్స్‌లో కనపడుతుందిట. కానీ టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం రేపడం, డ్రగ్స్‌ వాడుతున్న వారి పేర్లు బయటికి వచ్చి వారం అవుతోంది. అందరి వాదనలు విని, ఇంటరాగేట్‌ చేసే సమాయానికి వారం దాటుతోంది. ఇక తాజాగా నిన్న సిట్‌ ఎదుట హాజరైన పూరీజగన్నాథ్‌, ఈరోజు హాజరైన శ్యాంకె.నాయుడుల బ్లడ్‌ శాంపిల్స్‌ని సిట్‌ అధికారులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. 

కానీ నాలుగు రోజులు దాటితే డ్రగ్స్‌ ఆనవాళ్లు బ్లడ్‌లో కనిపించవు కాబట్టి ఈ వివాదం చెలరేగిన వెంటనే ఆయా డ్రగ్స్‌ వాడే ప్రముఖులు ఈ వారం నుంచి వాటిని సేకరించడం తాత్కాలికంగా ఆపేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వైద్యులు మరో క్లూ ఇస్తున్నారు. నాలుగు రోజుల తర్వాత డ్రగ్స్‌ ఆనవాళ్లు బ్లడ్‌లో కనిపించకపోయినా గోళ్లు, వెంట్రుకల్లో మాత్రం 90రోజులు అంటే మూడు నెలల పాటు ఆ జాడ కనిపిస్తుందని వివరిస్తున్నారు. 

కానీ కొన్ని పత్రికలు కేవలం పూరీ బ్లడ్‌ శాంపిల్స్‌ తీసుకున్నారే గానీ గోళ్లు, వెంట్రుకలను తీసుకోలేదని రాస్తున్నాయి. మరి వారి బ్లడ్‌నే కాకుండా గోళ్లు, వెంట్రుకలను తీసుకున్నారో లేదో అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. 

Confused in the Case of Drugs:

According to doctors and researchers, any person who is taking drugs in the blood samples is four days away if it is taken.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ