Advertisementt

ఇంతకీ 'యుద్దం' తప్పదంటున్న చైతూ...!

Sat 22nd Jul 2017 02:16 PM
naga chaitanya,marai muthu director,lavanya tripati,yuddham saranam movie  ఇంతకీ 'యుద్దం' తప్పదంటున్న చైతూ...!
Yuddham Saranam Movie Update ఇంతకీ 'యుద్దం' తప్పదంటున్న చైతూ...!
Advertisement
Ads by CJ

'రారండోయ్‌ వేడుకచూద్దాం'తో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ని కొట్టాడు నాగ చైతన్య. ఇక ఆయన అక్టోబర్‌ 6న సమంతను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైయ్యే ముందు వస్తున్న ఆఖరి చిత్రం 'యుద్దం శరణం'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌లో ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విధంగా నాగ చైతన్య ఎంతో స్లైలిష్‌గా, మాస్‌గా కనిపిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. 

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఇక ఇందులో నిన్నటి హీరో శ్రీకాంత్‌ తొలిసారిగా ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ విలన్‌గా కనిపించనుండగా, తన తండ్రితో 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో నటించిన 'అందాల రాక్షసి' లావణ్య త్రిపాఠి ఈ సారి నాగ చైతన్య సరసన జోడీ కడుతోంది. దీంతో ఈ చిత్రం అందరికీ కీలకంగా మారింది. కృష్ణ మరైముత్తు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఆయన ఈ చిత్రాన్ని ఎంతో థ్రిల్లింగ్‌గా, ఎమోషనల్‌ కంటెంట్స్‌తో సస్పెన్స్‌గా తెరకెక్కించాడని టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి 'పెళ్లి చూపులు' ఫేమ్‌ వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తుండగా, అభిరుచి ఉన్న చిత్రాలను నిర్మించడంలో దిల్‌రాజు తర్వాత ఆ స్థాయికి ఎదుగుతున్న సాయి కొర్రపాటి దీనిని నిర్మిస్తున్నాడు. 

కాగా ఈ చిత్రం మొదట ఆగష్టు11న లాంగ్‌ వీకెండ్‌ వస్తుండటంతో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.కానీ అదేరోజు నితిన్‌ 'లై', రానా 'నేనే రాజు..నేనే మంత్రి'లు ఉండటంతో సోలో రిలీజ్‌ కోసం తేదీని ఖరారు చేసే పనిలో యూనిట్‌ ఉంది. ఇక నాగార్జున నటించిన 'రాజుగారి గది2' కోసం అప్పుడెప్పుడో ఆగష్టు25వ తేదీని లాక్‌ చేశారు. ఇప్పుడు తండ్రి సినిమా స్థానంలో అదేరోజున కుమారుడు నాగ చైతన్య నటిస్తున్న 'యుద్దం శరణం' విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

Yuddham Saranam Movie Update:

Naga Chaitanya and Lavanya Tripati starring movie 'Yuddham Saranam' Director by Marai Muthu. This Movie shooting is completed and movie release on August 25th.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ