Advertisementt

సుబ్బరాజు మొత్తం చెప్పేశాడు..!

Sat 22nd Jul 2017 07:35 PM
subbaraju,sit,akun sabharwal,drugs racket  సుబ్బరాజు మొత్తం చెప్పేశాడు..!
Subbaraju Reveals Shocking Facts! సుబ్బరాజు మొత్తం చెప్పేశాడు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఇప్పుడప్పుడే ఒక కొలిక్కివచ్చేలా లేదు. ఈ కేసులో నోటీసులు అందుకున్న వాళ్ళు సిట్ ముందు విచారణకు హాజరవుతుంటే మరికొంతమంది మాత్రం తమని కూడా ఎక్కడ విచారణకు పిలుస్తారో అని హడలిపోతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాతో ఉన్న లింకులు చిన్నగా బయటికి వస్తున్నాయి. ఈ డ్రగ్స్ మాఫియా అన్ని రకాలుగా తెలుగు రాష్ట్రాల్లో చొచ్చుకుపోయింది. కాలేజస్ లోనే కాదు స్కూల్స్ ని కూడా టార్గెట్ చేశాయి డ్రగ్స్ ముఠాలు. అలాగే పొలిటీషియన్స్ కి కూడా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా వుంది. ఇప్పుడు నోటీసులు అందుకున్న సెలబ్రిటీస్ ని విచారిస్తున్న సిట్ అధికారుల ముందు వారు నమ్మలేని నిజాలు బయటపెడుతున్నారంటూ రాష్ట్రంలోని ఒక ప్రముఖ దిన పత్రిక కథనాలు ప్రచారం చేస్తుంది.

ముందుగా పూరీని విచారించిన సిట్ తర్వాత శ్యాం కె నాయుడుని విచారించింది. తాజాగా శుక్రవారం నటుడు సుబ్బరాజుని సిట్ అధికారులు డ్రగ్స్ కి సంబందించిన ప్రశ్నలు సంధించగా.. సుబ్బరాజు నమ్మలేని నిజాలు సిట్ అధికారుల ముందు బయట పెట్టినట్లు చెబుతున్నారు. టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు నిర్మాతల కొడుకులు (ఇద్దరు హీరోలు), సీనియర్ నటుడు కూతురు వున్నట్లు నటుడు సుబ్బరాజు సిట్ అధికారులకు ముందు వెల్లడించినట్టు ఆ పత్రిక చెబుతుంది. అయితే ఇప్పుడు ఆ ప్రముఖులు ఎవరు అంటూ టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతుంది. డ్రగ్స్ వాడకంలో మూడు ప్రముఖ సినీ కుటుంబాల సభ్యులు వున్నారని చెబుతున్నారు. అందులో ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఒక హీరోయిన్ కూడా డ్రగ్స్ వ్యవహారంలో వున్నట్లు సమాచారం.

అయితే టాలీవుడ్ లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సినీ కుటుంబానికి ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు సుబ్బరాజు సిట్ ముందు చెప్పాడని అంటున్నారు. అలాగే ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీలోనే పాతుకుపోయిన ఒక హీరోకి కూడా వచ్చే వారం నోటీసులు ఇవ్వనున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ఈ డ్రగ్స్ కేసులో పీకల్లోతు కూరుకుపోయినట్టు ఆ పత్రిక వార్తలు ప్రచురించింది.

Subbaraju Reveals Shocking Facts!:

Subbaraju is learnt to have disclosed shocking facts to SIT officials. The officials have understood the drugs were supplied through 16 pubs across Hyderabad city.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ