Advertisementt

ఎన్టీఆర్, రానా..నువ్వా నేనా!?

Sun 23rd Jul 2017 01:15 PM
jr ntr,bigg boss,rana daggubati,no 1 yaari with rana  ఎన్టీఆర్, రానా..నువ్వా నేనా!?
Young Tiger NTR Vs Rana Daggubati with Television shows ఎన్టీఆర్, రానా..నువ్వా నేనా!?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ రెమ్యూనరేషన్‌తో పాటు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, భారీ మొత్తాలని ఇచ్చి సెలబ్రిటీలను తీసుకుని 'బిగ్‌బాస్‌'షోని తెలుగులో అత్యంత ఖరీదైన షోగా స్టార్‌మా నిర్వహిస్తోంది. భారీగా ఖర్చు పెట్టడానికి కారణం.. ఈ షో ఓ సంచలనం సృష్టిస్తుందని, ఈ కాన్సెప్ట్‌ తెలుగువారికి కొత్త కావడంతో అత్యంత ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌లను, ఆదాయాలను తెస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. 

అదే సమయంలో జెమినీ టీవీలో భళ్లాల దేవ రానా హోస్ట్‌గా 'నెంబర్‌1 యారీ విత్‌ రానా' అనే టాక్‌ షో మొదలైంది. ఇంతకు ముందు, ఇప్పుడు కూడా పలు ఛానెల్స్‌లో సెలబ్రిటీలను పిలిచి వారి ఆసక్తి కలిగించే సంఘటనలు, వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన సీక్రెట్స్‌ని ప్రశ్నలతో రాబట్టే షోలు వస్తూనే ఉన్నాయి. దాంతో 'నెంబర్‌1 యారీ విత్‌ రానా'పై పెద్దగా ఎవ్వరూ భారీ నమ్మకాలు, అంచనాలు పెట్టుకోలేదు. ఇక ఈ షోని కూడా జెమిని చానెల్‌ పెద్దగా ప్రోమోలు, భారీ పబ్లిసిటీ ఇవ్వకుండా లిమిటెడ్‌ బడ్టెట్‌తోనే నిర్వహిస్తోంది. కానీ ఈ షోకి మాత్రం అదిరిపోయే టీఆర్పీలు వస్తున్నాయి. ప్రతివారం రానా ఇద్దరు సెలబ్రిటీలను ఆహ్వానించి, వారిని తనదైన శైలిలో ప్రశ్నలు అడిగి మరీ ఆసక్తికర రహస్యాలను చెప్పిస్తున్నాడు. దీంతో ఈ షో బాగా హైలైట్‌ అవుతూ ఉంది. పలువురు ఈ షోకి అతుక్కుపోతున్నారు. 

'బిగ్‌బాస్‌'కి ఈ షో ఏమాత్రం పోటీ కాదని, ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌, ఇమేజ్‌లో రానాకి 10వవంతు కూడా లేదని కొందరు షో ముందే తేల్చేశారు. కానీ ఈ షో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో, ఏకంగా 9.1 టీఆర్పీ రేటింగ్‌ను సాధించడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ షోని గ్రేట్‌ సక్సెస్‌గా అబివర్ణిస్తూ, ఇటీవలి కాలంలో ఇంతగా ఆకట్టుకున్న షో రాలేదని పలువురు ఒప్పుకుంటున్నారు.మరోవైపు జెమిని యాజమాన్యం కూడా ఎలాంటి హైప్‌ లేకుండా ప్రారంభించిన ఈ షో రెస్పాన్స్‌ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఎంపిక, రానా అడుగుతున్న సరికొత్త ప్రశ్నలు, రాబడుతున్న సమాధానాలు,రానా వాక్చాతుర్యత వంటివి అందరినీ కట్టిపడేస్తున్నాయి...! 

Young Tiger NTR Vs Rana Daggubati with Television shows:

JR NTR Bigg Boss Show vs Rana Daggubati No 1 Yaari with Raana on Small Screen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ