Advertisementt

తరుణ్ చాలా విషయాలు బయట పెట్టేడట!

Sun 23rd Jul 2017 05:12 PM
tarun,drugs case,ravi teja,navadeep,kelvin,jeeshan  తరుణ్ చాలా విషయాలు బయట పెట్టేడట!
Many Things Known in The Tarun Inquiry తరుణ్ చాలా విషయాలు బయట పెట్టేడట!
Advertisement
Ads by CJ

డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో రోజుకో మలుపు తీసుకుంటుంది. కేసులో నోటీసులు అందుకున్న వారు సిట్ ఎదుట హాజరై విచారణలో పాల్గొంటూ కొన్ని నమ్మలేని నిజాలను బయటపెడుతున్నారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు కెల్విన్ అనే డ్రగ్స్ డీలర్ తో ఉన్న వారిని విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పుడు  జీషన్‌ అలీని కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇక పోలీస్ ల కష్టడీలో ఉన్న జీషన్‌ విచారణలో మరికొందరి పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి సెకండ్ లిస్ట్ లో యువ హీరోల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

అయితే డ్రగ్స్ కేసులో బాగా ఎక్కువగా కూరుకున్న వారిలో రవితేజ, నవదీప్ లను సిట్ అధికారులు ఇంకా విచారించాల్సి ఉంది. కానీ ఈలోపే రవితేజ, నవదీప్‌కు జీషన్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు సిట్‌ వద్ద ఆధారాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక తాజాగా తరుణ్ ని విచారణ చేపట్టిన సిట్ అధికారులు తరుణ్ నుండి చాలా విషయాలు బయటపెట్టించినట్లు చెబుతున్నారు. ఇక తరుణ్ విచారణలో పలు విషయాలు తెలిసినట్లు సమాచారం. అయితే తరుణ్ ని గోవా ట్రిప్పులు, డ్రగ్ డీల్స్, బినామీ పబ్‌ల వ్యవహారంపై సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

తరుణ్ మాత్రం తాను ఉదయం నుంచి ఉపవాసం ఉన్నానని సిట్ అధికారులకు చెప్పడంతో సాయంత్రం తరుణ్‌కు డాక్టర్స్ చేత  బీపీ చెక్‌ చేయించారు. ఇక పబ్స్ వ్యవహారంలో కూడా సిట్ అధికారులు చాలా సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. తరుణ్ ని విచారణ చేపట్టినప్పుడే సిట్ అధికారులు చాలామంది పబ్ ఓనర్స్ ని కూడా విచారించారు.

Many Things Known in The Tarun Inquiry:

Recently, SIT officers the inquiry into the drugs case of Tarun, has revealed several things.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ