Advertisementt

ఎన్టీఆర్‌ స్ధాపించిన పార్టీ ఇదే..!

Mon 24th Jul 2017 01:03 PM
jr ntr,director bobby,producer kalyan ram,jai lava kusa movie,sama samaj party  ఎన్టీఆర్‌ స్ధాపించిన పార్టీ ఇదే..!
Jr NTR Film Jai Lava Kusa Movie Update ఎన్టీఆర్‌ స్ధాపించిన పార్టీ ఇదే..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'జై లవ కుశ'తో పాటు 'బిగ్‌ బాస్‌'షోలో బిజీబిజీగా ఉన్నాడు. ఇక 'జై లవ కుశ'లోని 'జై' పాత్రకు సంబంధించిన టీజర్‌ ఆల్‌రెడీ విడుదలై ఆ పాత్ర ఎలా ఉండనుందో కాస్త ఐడియా వచ్చింది. ఇక ఇందులో 'జై' పాత్ర నత్తితో పాటు నెగటివ్‌ షేడ్స్‌తో కూడిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ పాత్ర అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అది నిజమని తాజాగా విడుదలైన పిక్‌ నిరూపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ పొలిటీషియన్‌గా బాగా నెగటివ్‌ షేడ్స్‌తో ఉండి, సమ సమాజ్‌ పార్టీ నాయకునిగా కనిపించనున్నాడు. 

ఎన్టీఆర్‌ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న షూటింగ్‌ స్టిల్‌ బయటకు రావడంతో ఇది ఖరారైన, నికార్సయిన న్యూసేనని తేటతెల్లమవుతోంది. మొత్తానికి ఈ చిత్రంతో ఎన్నో సంచలనాలకు ఎన్టీఆర్‌ కేంద్ర బిందువుగా మారనున్నాడు. నేటి పొలిటికల్‌ సిట్యూయేషన్స్‌, పరిణామాలపై కూడా ఎన్టీఆర్‌ తనదైన ఎమోషనల్‌గా పీక్‌లో ఉన్నప్పుడు వచ్చే నత్తితో రాజకీయ ప్రచారం, ప్రసంగాలు, డైలాగ్‌లు, పంచ్‌లు బాగానే పడటం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు 'లవ','కుశ' పాత్రలను కూడా పరిచయం చేస్తే త్వరలోనే టీజర్స్‌ రానున్నాయి. యూనిట్‌ ఆ పనిలోనే నిగమ్నమై ఉంది. 

ఇంత వరకు ఎవ్వరూ చేయని సాహసాలను, సంచలనాలను, తనలోని నటవిశ్వరూపాన్ని పూర్తిగా బయటకు తెచ్చి నేటి స్టార్స్‌లో ఎన్టీఆర్‌ని మించిన వారే లేరని నిరూపించే విధంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 21న పక్కాగా రిలీజ్ చేస్తారని, దానికి తగ్గట్లుగా బాబి కూడా షూటింగ్‌ వేగం పెంచాడని అంటున్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ అభిమానులే కాదు... అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పటి నుంచే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికి ఎన్టీఆర్‌ 'జై లవ కుశ'లో సమ సమాజ్‌ పార్టీకి 'జై' కొట్టనున్నాడు. 

Jr NTR Film Jai Lava Kusa Movie Update:

NTR In 'Jai Lava Kusa' Sama Samaj Party will hit the 'Jai'. This movie release on September 21st.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ