సమకాలీన సమస్యలు, సమాజంలో జరిగే సంఘటనలకు తెరరూపం ఇచ్చేవాడే నిజమైన నిబద్దత కలిగిన దర్శకుడు. సమాజంలోని అందరూ ఆలోచించే దానికి విభిన్నంగా ఆలోచించగలిగితేనే నిజమైన క్రియేటర్. ఈ విషయం తన చిత్రాలతో కృష్ణవంశీ ఎప్పుడో నిరూపించుకున్నాడు. 'సింధూరం, ఖడ్గం'లలో ఆయన చూపిన పాయింట్స్‌ని అంత ఆకట్టుకునేలా చెప్పాలంటే క్రియేటివిటీతో పాటు గట్స్ కూడా ఉండాలి.
ఇక ఇటీవల పోలీసులను ఆంజనేయ స్వామితో పోలుస్తూ ఓ చిత్రం వచ్చింది. కానీ అంత కంటే ముందే ప్రారంభమైన కృష్ణ వంశీ తాజా చిత్రం 'నక్షత్రం'లో ఆయన అదే చూపించనున్నాడు. ఆయన మాట్లాడుతూ, నిజమైన పోలీసు ఎలా ఉంటాడు? అతనిని మనం ఎలా చూడాలి? అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ సినిమా కథ, పోలీసుకు, ఆంజనేయస్వామికి కొన్ని సారూపత్యలున్నాయి. హనుమంతునిలాగానే పోలీసులలో కూడా సేవభావం, ప్రజల పట్ల భక్తి, శక్తియుక్తులు ఉండాలి.
అసలు మనల్ని రక్షించడానికి ఉన్న పోలీసును చూసి మనం తప్పు చేయకపోతే వారికి ఎందుకు భయపడాలి? అసలు పోలీసులు మారడం కాదు. ముందుగా మనం పోలీసులను చూసే విధానం మారాలి. ఓ పోలీసు కావాలనుకున్న యువకుని కథే ఈ 'నక్షత్రం'. దీనికి యు/ఎ సర్టిఫికేట్ రావడమే కాదు.. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి ఎంతో మెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రంలో పోలీసులు,ప్రజలు, సమాజం గురించి చర్చిస్తూనే ఓ అంతర్జాతీయ సమస్యను ఆవిష్కరించాం.. అంటూ చెప్పుకొచ్చారు.
వాస్తవానికి కృష్ణ వంశీ కల్పిత కథల కంటే నిజ జీవిత సంఘటనలను చూపించడంతోనే ఆయనకు అంత గుర్తింంపు వచ్చింది. ఇక ఆయన ఏ చిత్రం తీసినా కూడా అందులో ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం ఆయన నైజం, 'గులాబి' నుంచి 'గోవిందుడు అందరివాడేలే' వరకు ఆయన మనస్తత్వం మనకు బాగా ఆర్ధమవుతుంది. బంధాలు, అనుబంధాల ఆవశ్యకత, గ్రామానికి ఏదో చేయాలనే తపన వంటివి అంతర్లీనంగా గోవిందడు అందరివాడేలేలో కూడా ఉన్నాయి. కాకపోతే జయాపజయాలు ఎవ్వరి చేతుల్లో లేవు. కాబట్టి ఆయన రేసులో కాస్త వెనుకబడి ఉండవచ్చు. అలాంటి దర్శకుల అవసరం సమాజానికి ఉంది. కానీ ఈ చిత్రం టీజర్స్, ట్రైలర్స్‌తో మాత్రం అరుపులు, హీరోయిన్ల అందచందాల పైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. మొత్తానికి పోలీస్ సబ్జెజక్ట్ అనేద తెలుగులో ఓ కమర్షియల్ సక్సెస్ మంత్రంమే అనేదా. మరి ఆగష్టు 4న విడుదల కానున్న ఈ చిత్రం మరలా పాత వంశీని గుర్తుకు తెస్తుందో లేదో చూడాలి...!