Advertisementt

దీపావళికి దెయ్యంగా భయపెట్టనున్నాడు ఈ హీరో!

Mon 24th Jul 2017 04:58 PM
nagarjuna,samantha,raju gari gadhi 2 movie,release october 12th,seerat kapoor  దీపావళికి దెయ్యంగా భయపెట్టనున్నాడు ఈ హీరో!
'Raju Gari Gadhi 2' to Release on October 12th దీపావళికి దెయ్యంగా భయపెట్టనున్నాడు ఈ హీరో!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన నాగార్జున-రాఘవేంద్రరావుల 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ఆడలేదు. ఇక తాజాగా 'రాజు గారి గది'గా వచ్చి మంచి విజయం సాధించిన చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న 'రాజు గారి గది2'లో నాగార్జున నటిస్తున్నాడు. టైటిల్‌ 'రాజు గారి గది2' అయినా ఆ చిత్రానికి దీనికి కథ పరంగా ఏమీ సంబంధం ఉండదని, ఓ మలయాళ హిట్‌ మూవీకి ఇది రీమేక్‌ అని అంటున్నారు. ఇక మొదటి చిత్రం ఆడకపోయినా రెండో చిత్రం 'రాజు గారి గది'తో హిట్‌ కొట్టిన యాంకర్‌, హోస్ట్‌ ఓంకార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 

ఇక ఇందులో ఓ మానసిక వైద్యునిగా, ఇతరులు మనసులతో ఆడుకునే సైక్రియాట్రిస్ట్‌ కమ్‌ సైకాలజిస్ట్‌గా నాగార్జున నటిస్తున్నాడని, ఆయన కాబోయే కోడలు సమంత ఇందులో దెయ్యం పట్టిన యువతిగా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇవి నిజమో కాదో తెలియదు. ఇందులో నాగ్‌ సరసన అందాల భామ సీరత్‌ కపూర్‌ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయినా కూడా ఆగష్టులో తన పెద్ద కుమారుడు నటించిన 'యుద్దం శరణం' రిలీజ్‌ ఉండనుంది. 

సెప్టెంబర్‌ మొత్తం పెద్ద చిత్రాల హడావుడి. అందునా 'రాజు గారి గది 2'లో గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండటంతో పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలను ముందుగానే ఆగష్టు నెలాఖరులోపే పూర్తి చేసి, ఆ తర్వాత భారీ ప్రమోషన్‌తో దీపావళికి ముందు వచ్చే వీకెండ్‌లో అంటే అక్టోబర్‌ 12న విడుదల చేయడానికి నిర్ణయించారు. ఇక సమంత-నాగ చైతన్యల వివాహం అక్టోబర్‌ 6న జరుగనుండగా, కేవలం మూడు రోజుల గ్యాప్‌లోనే మరలా షూటింగ్‌కి హాజరవుతామని, హనీమూన్‌ పెళ్ళియిన వెంటనే ఉండదని సమంత తేల్చేసింది...! 

'Raju Gari Gadhi 2' to Release on October 12th:

Directed by Ohmkar, Nagarjuna is playing a mentalist while Samantha will be seen as a ghost.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ